హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్ దీపికా

Rebel Star Prabhas Sends Out Birthday Wishes To Deepika Padukone On Instagram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Deepika Padukone,Actress Deepika Padukone,Heroine Deepika Padukone,Prabhas,Actor Prabhas,Hero Prabhas,Rebel Star Prabhas,Prabhas Wishes His Co Star Deepika Padukone On Instagram,Prabhas Wishes Deepika Padukone On Her Birthday,Prabhas Birthday Wishes To Deepika Padukone,Prabhas Calls Deepika Gorgeous Superstar,Happy Birthday Gorgeous Superstar Deepika Padukone,#HBDDeepikaPadukone

దీపికా పదుకొనే ఈ పేరును తెలుగు వారికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్స్ తో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఇక ఇప్పుడు తెలుగు తెరపై కూడా కనిపించనుంది. నాగ్ అశ్విన్ తో ప్రభాస్ 21 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ రోజు దీపికా పదుకొనె పుట్టినరోజు.. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఈ భామకు బర్త్ డే విషెస్ అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ కూడా దీపికాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. హ్యాపీ బర్త్ డే గార్జియస్ సూపర్ సార్ట్ అంటూ ఇన్స్టా వేదికగా బర్త్ డే విషెస్ తెలియచేశాడు.

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas)

ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు. ఈ సినిమా కోసం మరో లెజెండ్రీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కూడా మెంటర్ గా పని చేయనున్నారు. పాన్ వరల్డ్ సినిమా కాబట్టి ఈ సినిమా అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ మరియు ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

కాగాప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్నాడు. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ను జరుపుకుంది. ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + eleven =