తెలుగు , కన్నడ , తమిళ , హిందీ మూవీస్ లో స్టార్ విలన్ గా సోనూ సూద్ రాణిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “అరుంధతి ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సోనూసూద్ బెస్ట్ విలన్ గా నంది అవార్డ్ అందుకున్నారు. పలు భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ లో ప్రతినాయకుడిగా ప్రేక్షకులను అలరించిన సోనూసూద్ ప్రస్తుతం “ఆచార్య “, “అల్లుడు అదుర్స్ “, “పృథ్విరాజ్” (హిందీ ), “తమిళరసన్ “(తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




రీల్ లైఫ్ లో హీరోగా రాణించాలనుకున్న సోనూసూద్ , లాక్ డౌన్ సమయంలో పేదలకు , వలస కార్మికులకు కోట్లాది రూపాయల సహాయం అందించి రియల్ లైఫ్ హీరోగా మారారు. నిర్మాతగా పలు మూవీస్ నిర్మించడానికి సోనూసూద్ ప్లాన్ చేశారు. ఇప్పుడు సోనూసూద్ చిరకాల కోరిక నెరవేరింది. ఒక బాలీవుడ్ మూవీ లో సోనూసూద్ హీరోగా ఎంపిక అయ్యారు. బ్లాక్ బస్టర్ “డ్రీమ్ గర్ల్” హిందీ మూవీ దర్శకుడు రాజ్ శాండిల్య నిర్మాతగా నివాస్ దర్శకత్వంలో సోనూసూద్ హీరోగా “కిసాన్ “హిందీ మూవీ రూపొందనుంది. “కిసాన్ “మూవీ అనౌన్స్ అవగానే బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హీరో సోనూ సూద్ , టీమ్ కు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు అందజేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























