టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ పూజాహెగ్డే సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ప్రస్తుతం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “, “రాధేశ్యామ్ “మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. స్టార్ హీరోలతో పాటు యువ హీరోలతో కూడా నటిస్తున్న పూజాహెగ్డే, దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందే మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు. బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్ “కభీ ఈద్ కభీ దివాలీ “, రణ్ వీర్ సింగ్ “సర్కస్ ” హిందీ మూవీస్ కు పూజాహెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు పూజాహెగ్డే ఒక పౌరాణిక చిత్రానికి కథానాయికగా ఎంపిక అయినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా “శాకుంతలం” తెరకెక్కించనున్నారు. మహాభారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమకథను దృశ్య కావ్యంగా ఆవిష్కరించనున్నారు. దర్శకుడు గుణశేఖర్ “శాకుంతలం”మూవీ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు . బ్లాక్ &వైట్ లో రూపొందిన ఆ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. శకుంతల క్యారెక్టర్ కై పలువురు హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. స్టార్ హీరోయిన్ అనుష్క ఈ మూవీ లో హీరోయిన్ గా ఎంపిక అయినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు పూజాహెగ్డే పేరు తెరపైకి వచ్చింది. ఆహ్లాద భరిత ప్రణయ గాథ “శాకుంతలం”మూవీ లో శకుంతల గా నటించడానికి పూజాహెగ్డే ఆసక్తి తో ఉన్నారనీ , దర్శకుడు గుణశేఖర్ కూడా సుముఖం గా ఉన్నారనీ సమాచారం.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: