మాస్ మహారాజా రవితేజ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో మూడో చిత్రం ‘క్రాక్’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు చిత్రయూనిట్. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసిన సంగతి కూడా విదితమే. జనవరి 1న న్యూ ఇయర్ కానుకగా క్రాక్ చిత్ర ట్రైలర్ విడుదల చేస్తున్నట్టు కూడా నిన్ననే అధికారికంగా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమా డబ్బింగ్ మొదలుపెట్టినట్టు తెలిపాడు రవితేజ. ఆయన డబ్బింగ్ థియేటర్ లో డబ్బింగ్ చెవుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి డబ్బింగ్ మొదలైనట్టు తెలిపాడు.
View this post on Instagram
కాగా యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. సముద్రఖనీ, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ‘మెర్సాల్’, ‘బిగిల్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలకు పనిచేసిన జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: