2020 లో ఎన్నో అనుభూతులను ఎదుర్కొన్నాం. మరి ముఖ్యంగా ఎవరూ ఊహించని విధంగా కరోనా వల్ల ప్రపంచం మొత్తం పెద్ద సంక్షోభంలో మునిగిపోయింది. అన్నిరంగాలపై కరోనా ప్రభావం పడింది. ఇప్పుడిప్పుడే కాస్త పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. ఇక నిరంతరం ప్రెస్ మీట్లు, షూటింగ్స్, సినిమా రిలీజ్ లు, ఆడియో ఫంక్షన్స్ అంటూ బిజీగా ఉండే సినీపరిశ్రములు మొత్తం కరోనా వల్ల బోసి పోయాయి. ఇక ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియా.. ఓటీటీ ఒక్కటే సినీ లవర్స్ కు కాస్త ఊరట నిచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా రివైండ్ 2020లో భాగంగా ట్విట్టర్‌లో అత్యధికంగా లైకులు పొందిన ట్వీట్స్, సబ్జెక్ట్స్ , రీట్వీట్లు పొందిన ట్వీట్లు ఇలా పలు అంశాలకు సంబంధించిన లిస్ట్ ను విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది మోస్ట్ ట్వీటెడ్ యాక్టర్స్ కు సంబంధించిన లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ లిస్ట్ లో మహేష్ బాబు నెంబర్ వన్ గా నిలిచాడు. మహేష్ బాబు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తన వ్యక్తిగత విషయాలు కుటుంబ విషయాలు తాజా సినిమాల అప్డేట్స్ షూటింగ్ స్పాట్ లోని విశేషాలకు సంబంధించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేస్తూ ఉంటారు. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో ఇళయ దళపతి విజయ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూర్య, అల్లు అర్జున్, రామ్ చరణ్, ధనుష్, మోహన్ లాల్, చిరంజీవి నిలిచారు.
మరోవైపు హీరోయిన్ల జాబితాలో కీర్తి సురేష్ మోస్ట్ ట్వీటెడ్ హీరోయిన్ గా మొదటి స్థానంలో నిలువగా కాజల్ రెండో స్థానంలో సమంత మూడో స్థానంలో నిలిచారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: