`విరాటపర్వం` ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

Actor Rana Daggubati Character In Virata Parvam, Rana As A Naxal Leader, Rana Daggubati, Rana Daggubati Upcoming Movie, Rana Daggubati Upcoming Movie Viraata Parvam, Rana Looks Perfect As A Naxal Leader, Telugu Filmnagar, Viraata Parvam, Viraata Parvam Movie, Viraata Parvam Movie Updates, Viraata Parvam Telugu Movie, Viraata Parvam Telugu Movie Latest News, Viraata Parvam Telugu Movie Shooting Latest News, Virata Parvam

నిన్న వెంకీ పుట్టిన రోజు కావడంతో ఆయన సినిమాలకు సంబంధించి అప్ డేట్స్ ఇచ్చి అభిమానులను ఫుల్ కుష్ చేశారు. ఇక ఈరోజు రానా పుట్టినరోజు కావడంతో వరుస అప్ డేట్స్ వస్తున్నాయి. రానా పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది. వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక రానా పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటికే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ఫస్ట్ లుక్ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో కామ్రేడ్ రవన్న పాత్రలో రానా కనిపించబోతున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ దేశం ముందు ప్ర‌శ్న‌గా నిల‌బ‌డ్డ జీవితం అతనిది..స‌త్యాన్వేష‌ణ‌లో నెత్తురోడిన హృదయం అతనిది అంటూ బ్యాక్ గ్రౌండ్ లో వస్తుండగా విజువల్స్, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటున్నాయి.

ఇంకా ఈసినిమాలో నందితా దాస్, ఈశ్వరీ రావ్‌,జరీనా వహాబ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. నివేదా పేతురాజ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుంది. 1990 ల నాటి సామజిక పరిస్థితుల ఆధారం గా రూపొందుతున్న ఈ మూవీని ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ పై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 1 =