మెగా వారసురాలు నిహారిక పెళ్లి వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. గత వారం రోజుల నుండి టాలీవుడ్ లో ఎక్కడ విన్నా నీహారిక పెళ్లి కబుర్లేవినిపించాయి. మెగా పరివారమంతా రాజస్థాన్ ఉదయ పూర్ లో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. నిజానికి పవన్ రాకపోతే ఆ వెలితి ఉండేది.. అయితే పవన్ కూడా ఈ పెళ్ళికి హాజరవడంతో ఇంకా నిండుతనం వచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి పెళ్లి అయిపోవడంతో అందరూ ఎవరి ఇళ్లకు వాళ్లు తిరిగి పయనమయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నిహారిక పెళ్లిని అన్న వరుణ్ తేజ్ దగ్గరుండి చేసిన విషయం అందరికి తెలుసు. తన చెల్లి పెళ్లిని దగ్గరనుండి.. ఖర్చు లో కాంప్రమైజ్ కాకుండా చేయించాడు. ఇదిలా ఉండగా నిహారిక పెళ్లి సమయంలో భావోద్వేగం అయి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. నేడు వరుణ్ కూడా ఎమోషనల్ అయ్యాడు. ఈ నేపథ్యంలో వరుణ్ తన ట్విట్టర్ ద్వారా.. బంగారు తల్లి నిహారిక… నా బావ చైతన్య హ్యాపీ మారీడ్ లైఫ్.. నేను ఎంత హ్యాపీ గా ఉన్నానో మాటల్లో చెప్పలేను.. అలాగే లవ్లీ విషెస్ అందించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేసాడు.
Wishing my Bangaru thalli @IamNiharikaK and my dashing bava Chaitanya a happy married life..
Can’t express in words about how happy I am right now!And thanks to each and everyone for the lovely wishes..❤️#Nischay pic.twitter.com/y75jgkjv6Z
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) December 11, 2020
కాగా ప్రస్తుతం వరుణ్ నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. ఈ సినిమా కోసం ఒలింపిక్ విన్నర్ టోని జెఫ్రీస్ పర్యవేక్షణలో కూడా ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైస్సన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై అల్లు బాబీ, సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు… హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవాల్ ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: