సక్సెస్ ఫుల్ “అప్పట్లో ఒకడుండేవాడు ” మూవీ తో శ్రీవిష్ణు టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తున్న శ్రీవిష్ణు “మెంటల్ మదిలో”, “నీదీ నాదీ ఒకే కథ “, “బ్రోచేవారెవరురా ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. “రాజా రాజా చోర “, “గాలి సంపత్ ” మూవీస్ లో నటిస్తున్న శ్రీవిష్ణు హీరోగా మరో మూవీ ప్రారంభం అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తేజ మార్ని దర్శకత్వంలో శ్రీవిష్ణు , అమృత అయ్యర్ జంటగా ఎంటర్ టైనర్ మూవీ గురువారం హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది. ముహూర్త సన్నివేశానికి “బ్రోచేవారెవరురా మూవీ ఫేమ్ దర్శకుడు వివేక్ ఆత్రేయ క్లాప్ ఇవ్వగా , నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ స్విచ్చాన్ చేశారు. “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ “మూవీ ఫేమ్ దర్శకుడు స్వరూప్ ఆర్ ఎస్ జె గౌరవ దర్శకత్వం వహించారు . మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణ సంస్థలో ప్రొడక్షన్ నెం 9 గా రూపొందుతున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. అమృత అయ్యర్ కథానాయికగా నటించిన “30రోజులలో ప్రేమించడం ఎలా ?”, “RED ” మూవీస్ రిలీజ్ కాకుండానే ఈ మూవీ లోఅమృత అయ్యర్ కు కథానాయికగా అవకాశం రావడం విశేషం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: