వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ , పిక్స్ మేకర్ స్టూడియోస్ , పిక్చర్ మేకర్ స్టూడియోస్ బ్యానర్స్ పై శ్రీ రామ్ రాఘవన్ దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా , రాధికా ఆప్టే జంటగా , సీనియర్ హీరోయిన్ టబు ఒక కీలక పాత్రలో రూపొందిన బ్లాక్ కామెడీ థ్రిల్లర్ “అంధాధున్ ” హిందీ మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హీరోయిన్ టబు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“అంధాధున్ ” మూవీ తెలుగు , తమిళ భాషలలో రీమేక్ జరుపుకుంటుంది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ , నభా నటేష్ జంటగా , హిందీ మూవీ లో టబు పాత్రలో తమన్నా నటిస్తున్న “అంధాధున్ ” మూవీ తెలుగు రీమేక్ మూవీ షూటింగ్ దుబాయ్ లో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. యాక్టర్ , ప్రొడ్యూసర్ , డైరెక్టర్ త్యాగరాజన్ తన తనయుడు ప్రశాంత్ హీరోగా ఫెడ్రిక్ దర్శకత్వంలో “అంధాధున్ ” మూవీ తమిళ రీమేక్ మూవీ ని నిర్మిస్తున్నారు. తెలుగు , తమిళ భాషలలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణించిన సిమ్రాన్ ను టబు నటించిన పాత్రకై ఎంపిక అయ్యారని సమాచారం. హీరోయిన్ సిమ్రాన్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: