ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘జాంబిరెడ్డి’. బాల నటుడిగా పరిచయమైన తేజా సజ్జా ఈ సినిమాతో హీరోగా మారబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన హీరో హీరోయిన్ల ఫస్ట్ లుక్ పోస్టర్లకూ, మోషన్ పోస్టర్‌కూ మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టేసింది. ఈ చిత్రానికి సంబంధించి డబ్బింగ్ వర్క్ మొదలైనట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసాడు చిత్రయూనిట్. టీజర్ ప్రారంభంలో ‘దైవం మనుష్య రూపేనా అన్నది ఇతిహాసం. రాక్షసం మనుష్య రూపేనా అన్నది ప్రస్తుతం. భగవంతుని అద్భుత సృష్టిలో ఒకే ఒక పొరపాటు. మనిషికి మేధాశక్తిని ఇవ్వడం. ఆ మేధాశక్తి తనకే ఓ ప్రశ్నగా నిలిస్తే.. దైవం నేర్పే గుణపాఠం మనిషి ఉనికికే ప్రమాదం’ అంటూ వాయిస్ ఓవర్‌తోనే భయపెట్టాడు దర్శకుడు. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థ్రిల్లింగ్ గా అనిపించాయి. మొత్తానికి ఈ టీజర్ ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు. మరి చూద్దాం సినిమా ఎలా ఉంటుందో.
కాగా ఆనంది, దక్ష హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ఆపిల్ స్టూడియోస్ బ్యానర్‌పై రాజశేఖర్ వర్మ నిర్మిస్తున్నారు. మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నారు. మరి సినిమా సినిమాకు వైవిధ్యతను చూపిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. మొదటి సినిమా ‘అ’ సినిమాతోనే తనలోని విభిన్నతను చూపించాడు. రెండో సినిమా కల్కి రాజశేఖర్‌తో చేసి ఆకర్షించారు. ఇక ఇప్పుడు మూడో సినిమాగా ప్రశాంత్ వర్మ ఈ సినిమాతో ఎలా మెప్పిస్తాడో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: