తిమ్మరుసు ఫస్ట్ లుక్ రిలీజ్ – టీజర్ కు డేట్ ఫిక్స్

Thimmarusu Movie First Look and Teaser Release Dates,Latest Tollywood News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Anasuya upcoming film,Thimmarusu Movie First Look,Thimmarusu Movie Teaser,Thimmarusu Movie Latest News,Satyadev Thimmarusu Movie,Satyadev New Movie Thimmarusu,Thimmarusu First Look and Teaser Dates Confirmed

టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ప్రస్తుతం మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్ టైల్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. గుర్తుందా శీతాకాలం టైటిల్ తో ఈ సినిమా రీమేక్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. ఈ సినిమాకు నాగ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాతో పాటు నూతన దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తిమ్మరుసు అనే సినిమాను చేయనున్నాడు. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్‌ కోనేరు‌తో కలిసి ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై నిర్మాత సృజన్‌ ఎరబోలు ‘తిమ్మరుసు’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకోని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టేసారు. ఇక తాజాగా మరో అప్ డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ సినిమాలోని సత్యదేవ్ ఫస్ట్ లుక్ ఈరోజు విడుదల చేసిన చిత్రబృందం టీజర్ ను ఈనెల 9న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

కాగా కంటెంట్ ఉన్న క‌థ‌ల్ని ఎంచుకుంటూ త‌నకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ లో ఉన్న టాలెంటడ్ నటుల్లో సత్యదేవ్ ఒకడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవలే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో మరోసారి తన నట నిజస్వరూపం చూపించాడు. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ గా వున్నాడు. మరి ఈ సినిమాలు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =