బిగ్ బాస్ 4 – షో ఎండింగ్ కు వస్తుండేసరికి బిగ్ బాస్ కు కూడా ఏం చేయాలో తెలియట్లేదనుకుండా.. రోజురోజుకి బోరింగ్ గా సాగుతుంది తప్పా.. ఎక్సైట్ మెంట్ మాత్రం ప్రేక్షకుల్లో తగ్గిపోతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక రాత్రి ఎపిసోడ్ కూడా కాస్త బోరింగ్ గానే అయిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రెండు రోజుల నుండి రేస్ టు ఫినాలే టాస్క్ జరుగుతూనే ఉంది. నిన్న సెకండ్ లెవెల్ లో అభి, హారిక, సోహెల్ ఇంకా అఖిల్ మధ్య టాస్క్ పెట్టగా ఆ లెవల్ లో అభి, హారిక అవుట్ అవ్వడంతో అఖిల్, సోహెల్ మూడో లెవల్ కు వెళ్లారు. ఇక ఈ రోజు వీరిద్దరి మధ్య మూడో లెవెల్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. మూడో లెవల్లో ఉయ్యాల ఊగమని చెప్పాడు. ఈ టాస్క్‌కు సంచాలకుడిగా అభిజిత్ ను వ్యవహరించమని చెప్పాడు.
ఇక టాస్క్ బజర్ మోగగానే ఇద్దరూ ఉయ్యాలలో కూర్చున్నారు. ఇక వారి దగ్గరికి హౌస్ మేట్స్ వచ్చి కాస్త టైమ్ పాస్ చేశారు. మరో పక్క బిగ్ బాస్ వారికి ఒక్కోసారి ఒక్కో ఐటమ్ పంపించారు. ముందు స్వెటర్స్ వేసుకోమని చెప్పాడు. ఆ తర్వాత పాలను పంపించాడు. ఈ నేపథ్యంలో అవినాష్ ఈ ఇద్దరినీ 48 గంటలు ఉయ్యాల మీద నుంచి దింపకండా ఉంచమని కోరాడు. ఆ తర్వాత అవినాష్,మోనాల్ కాస్త కామెడీ చేశారు. అవినాష్ మోనాల్ కలిసి బయటకు రావడాన్ని చూసిన అఖిల్.. అతడు మీ తమ్ముడా అని మోనాల్‌ను అడిగాడు. అందుకు అవినాష్ నేను నీకు అన్నయ్యనా? అవినాష్‌నా? అని అడగ్గా మోనాల్ అవినాష్ అన్నయ్య అని చెప్పడంతో అందరూ నవ్వుకున్నారు.
ఇదిలా ఉండగా ఇద్దరూ ఎలాంటి అర్గ్యూ లేకుండా ఉండటంతో ఆ తర్వాత ముల్లంగి రసాన్ని పంపి ఒకరికి ఒకరు చెంచాతో తాగించుకోమని చెప్పాడు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఇచ్చాడు. ముల్లంగి రసాన్ని తాగించే సభ్యుడు తను ఉయ్యాల మీద ఉండటానికి ఎందుకు అర్హుడు? ఎదుటివాడు ఎందుకు అనర్హుడు? అన్న విషయాన్ని చెప్పాలని ఆదేశించాడు. ఈ క్రమంలో ఇద్దరికీ చిన్నపాటి గొడవ జరిగింది. తర్వాత ఇదంతా కాదని చిన్నచిన్న కారణాలు చెప్తూ జ్యూస్ తాగించుకున్నారు.
ఈ ఎపిసోడ్ లో కాస్త హైలైట్ పాయింట్ ఏదైనా ఉందంటే అది అభి-హారిక మధ్య వచ్చిన డిస్కషన్ అని చెప్పొచ్చు. హారిక.. తనకు నాగ్ క్లాస్ పీకిన విషయాన్ని అభిజిత్ కు చెప్పింది. ఒక కెప్టెన్‌గా మోనాల్‌తో డేట్‌కు వెళ్లాల్సిన టాస్క్ చేయించకపోవడం తప్పని నాగ్ సర్ చెప్పారని బాధపడింది. దీంతో అభిజిత్ నేను టాస్క్ చేయనందుకే సారీ చెప్పానని.. కేవలం ఒక జెంటిల్ మెన్ వే లో చెప్పానని చెప్పాడు. అంతే కాదు ఇన్ని రోజులు సస్పెన్స్ గా సాగిన ‘ఏ’ ఎవరో క్లారిటీ వచ్చేసింది. ‘నేనంటే ఇష్టమని మోనాల్ స్వయంగా నాతో చెప్పింది. తర్వాత ప్రతిసారి ఆమె మనసులో ఒక A ఉందంటున్నారు కదా! ఆ A ఎవరు అని అడిగితే నేనే అంది. కానీ ఇది ఎప్పుడూ అందరి ముందు బయట పెట్టలేదు. అయినా సరే ఆమె నాకు స్టాండ్ తీసుకోలేదు, ఇంకా నామినేట్ చేసింది’ అని నిజం బయట పెట్టేసాడు. అయితే అతడు ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటే.. హారిక తెలుగు తెలుగు అని పదే పదే గుర్తు చేస్తుండటంతో దీంతో కోపం వచ్చిన అభి.. నువ్వు నాతో మాట్లాడాలంటే ఇంకో 5 సంవత్సరాలు ఎదగాలి అన్నాడు. ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు అని వెళ్ళిపోయాడు.
మరోవైపు ఇది అఖిల్, సోహెల్ కు మాత్రమే టాస్క్ కాకుండా హౌస్ మేట్స్ కు కూడా టాస్క్ అయింది. టాస్క్ జరుగుతున్నప్పుడు లైట్స్ ఆర్పకూడదని చెప్పడంతో కంటెస్టెంట్లు జాగరణ చేశారు. ఇక అఖిల్ అరియానాతో పులిహోర కలుపుతున్నాడని హారిక మోనాల్ చెవిలో ఊదింది. ఇదెప్పుడు జరిగిందని మోనాల్ అవాక్కైంది. మరోవైపు అవినాష్ అరియానా మీద కూడాజోక్ చేశాడు. దీంతో ఆమె వచ్చి అవినాష్‌కు నాలుగు దెబ్బలు వేసింది.
ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఎవరు టాస్క్ గెలిచారు.. ఎవరు డైరెక్ట్ గా ఫైనల్ కు వెళ్లారు అన్నది తెలియాలంటే మాత్రం ఈరోజు ఎపిసోడ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: