మళ్లీ షూటింగ్ షురూ చేసిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ టీమ్

Solo Brathuke So Better Shooting Gets Resumed

సుబ్బు ద‌ర్శ‌కత్వంలో సాయి తేజ్ హీరోగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమాను మే డే రోజు అంటే.. 2020 మే 1 వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు కానీ కరోనా వల్ల కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. మధ్యలో షూటింగ్ లకు అనుమతులు వచ్చిన ఎవరు అంత ధైర్యం చేయలేకపోయారు. అయితే దాదాపు ఆరు నెలల తర్వాత ఈ మూవీ షూటింగ్ మ‌ళ్లీ స్టార్ట్ అయింది. చిత్రబృందం మొత్తం ఈ షూటింగ్ లో పాల్గొన్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ విషయాన్ని స్వయంగా సాయి తేజ్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ..షూటింగ్ లో పాల్గొన‌డం ఎక్సయిటింగ్ గా ఉంద‌ని ‌సాయిధ‌ర‌మ్ తేజ్ ట్వీట్ చేశాడు. అంతేకాదు సెట్స్ లో జాయిన్ అయిన వీడియోను ట్విట్ట‌ర్ లో కూడా పోస్ట్ చేశాడు.

 

కాగా `ఇస్మార్ట్ శంక‌ర్` భామ నభా నటేష్ హీరోయిన్ గా రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

మరి ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఆరు ఫ్లాప్స్ తర్వాత ‘చిత్రలహరి’ సినిమాతో ఫైనల్ గా తన హిట్ ఖాతాను తెరిచాడు మెగా హీరో సాయి తేజ్. ఇక రీసెంట్ గా మారుతి దర్శకత్వంలో ‘ప్రతిరోజు పండగే’ తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. మరి బ్యాచిలర్ లైఫే బెటర్ అంటూ డిఫరెంట్ స్టోరీ తో వస్తున్న సాయి తేజ్ ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతాడేమో చూద్దాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − 2 =