మొత్తానికి కరోనా మహమ్మారి ఏ ఒక్కరినీ వదలట్లేదు. సామాన్యుల దగ్గరనుండి సెలబ్రిటీస్ వరకూ అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీస్ కు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. కొంతమంది కోలుకున్నారు.. కొంతమంది కోలుకుంటున్నారు. లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుతం ఇదే కరోనాతో భాదపడుతున్నారు. ప్రస్తుతం అయనకు చెన్నై లోని హాస్పిటల్ లో ఇంకా ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు స్టార్ హీరోయిన్ తమన్నా ఇంట్లోనూ కరోనా మహమ్మారి వ్యాపించింది. ఆమె తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యిందని. కొద్దిరోజులుగా మా అమ్మా నాన్నలకు కొద్ది పాటి కరోనా లక్షణాలు కనిపించాయి. అయితే ముందు జాగ్రత్తగా ఇంట్లో కరోనా పరీక్షలు చేయించుకున్నాం.. పరీక్షా ఫలితాలు ఇప్పుడే వచ్చాయని.. దురద్రుష్టవశాత్తూ తన తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్ వచ్చిందని… అయితే తనతో సహా స్టాఫ్, మిగతా కుటుంబ సభ్యులకు కరోనా నెగిటివ్ వచ్చిందని తెలిపింది. దేవునిదయ వల్ల ప్రస్తుతం తన పేరెంట్స్ కోలుకొంటున్నారని.. మీ అందరి ప్రార్థలతో కరోనా నుంచి తొందరగా కోలుకుంటారని తెలిపింది.
View this post on Instagram
తమన్నా ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ ” మూవీలో నటిస్తుంది. ఈ సినిమాలో కబడ్డీ కోచ్ గా నటిస్తుంది. ఇంకా కన్నడ హిట్ మూవీ ‘లవ్ మాక్ టైల్’ సినిమా రీమేక్ లో నటిస్తుంది. ఇంకా “క్వీన్ ” మూవీ తెలుగు రీమేక్ “దటీజ్ మహాలక్ష్మీ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: