ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ కె.జి.యఫ్2. ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టనున్నట్టు ఇటీవలే సోషల్ మీడియా ద్వారా అప్ డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక చెప్పినట్టే ఈ రోజు షూటింగ్ ను మొదలు పెట్టారు. బెంగళూరులో వేసిన సినిమా సెట్స్ లో షూటింగ్ చేయనున్నారు. ఇక షూటింగ్ లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా జాయిన్ అయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. బ్యాక్ టు వర్క్ అంటూ తెలుపుతూ.. లొకేషన్ లో ప్రశాంత్ నీల్ తనకు సీన్ ను వివరిస్తున్న ఫొటోను పోస్ట్ చేశారు. ఇపుడుఈఫొటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ పై వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Start Camera..Action… BACK TO WORK.. pic.twitter.com/LzFFhJrsjG
— Prakash Raj (@prakashraaj) August 26, 2020
ఇక యష్ కూడా ప్రకాష్ రాజ్ ఫొటోను కూడా తన ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ.. కె.జి.యఫ్2 సెట్స్ లో ప్రకాష్ రాజ్ అంటూ ఈ పాత్రలో నటిస్తున్నారో గెస్ చేయమని నెటిజన్స్ కు ఒక ప్రశ్న కూడా వేశారు.
ఈ సీక్వెల్ కోసం అందరూ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం కె.జి.యఫ్2 సినిమా షూటింగ్ దశలో వుంది. దాదాపు చాలా వరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది. కరోనా వల్ల గ్యాప్ రాకపోతే ఈ పాటికి షూటింగ్ పూర్తయ్యేది. కాగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ ఈ చిత్రంలో అధీర అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. రవీనాటాండన్ ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో నటిస్తుంది. హోంబలే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం .. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మరి చూద్దాం ఇది ఎంత వరకూ సక్సెస్ అవుతుందో…ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: