విషమంగానే బాలు ఆరోగ్యం – ఎస్పీ చరణ్ భావోద్వేగం

SP Charan breaks down while updating the health condition of SPBalasubramanyam

గత కొద్దిరోజులుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే కదా. కరోనా రావడంతో ఆయన హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. మొదట నిలకడగా ఉన్న ఆయన ఆరోగ్యం తర్వాత క్షీణించినట్టు వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. ఆ తర్వాత మళ్లీ బాగానే వున్నారని.. ప్రస్తుతం కోలుకుంటున్నారని తెలిపారు. అయితే ప్రస్తుతం బాలు తనయుడు చరణ్ చెప్పిన మాటలు వింటుంటే మాత్రం ఇంకా బాలు పరిస్థితి ప్రమాదకరంగానే ఉన్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నాన్న ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉంది. చికిత్స కొనసాగుతోంది. అయితే ఎలాంటి ఇంప్రూవ్ మెంట్ లేదు… అభిమానులు, శ్రేయోభిలాషుల పార్థనలు ఆయనను కోలుకునేలా చేస్తాయని నమ్ముతున్నా. మా పట్ల చూపుతున్న ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు.’’ అని ఎస్పీ చరణ్ భావోద్వేగ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

 

ఇక ఇదిలా ఉండగా బాలు త్వరగా కోలుకోవాలని ఎంతో మంది సెలెబ్రిటీస్ సోషల్ మీడియా వేదికగా తమ ప్రార్థనలు అందించారు. తాజాగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కూడా తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ‘‘బాలూ… నాకు మాటలు రావట్లేదు… నువ్వు పాడితే వినాలనుంది.. నాతోపాటు నీ అభిమానులందరూ కన్నీళ్లతో ముక్కోటి దేవతలని ప్రార్థిస్తున్నాము… నీ గంభీరమైన స్వరంతో మైక్ ముందు మళ్ళీ పాట పాడాలి. తొందరగా కోలుకుని రా…’’ అని దర్శకేంద్రుడు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

మరి తెలుగు సినీ పరిశ్రమకు తన గళంతో ఎన్నో వేల పాటలు అందించిన బాలు తొందరగా కోలుకొని రావాలని.. ఇంకా ఎన్నో పాటలు పాడాలని కోరుకుందాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.