“ఆదిపురుష్ ” మూవీ లో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ ?

Bollywood Actor Saif Ali Khan To Play Main Villain In Prabhas Adipurush

బ్లాక్ బస్టర్ “బాహుబలి “, “బాహుబలి 2 ” మూవీస్ తో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ దేశవ్యాప్తం గానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. స్టైలిష్ మూవీ “సాహో “తో ప్రభాస్ బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుని , క్రేజ్ పెంపొందించుకున్నారు. హీరో ప్రభాస్ ప్రస్తుతం పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందనున్న “#Prabhas 21″ మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు ప్రభాస్ హీరోగా బాలీవుడ్ మూవీ”ఆదిపురుష్ ” రూపొందనుంది. ప్రభాస్ హీరోగా నటించే మూవీస్ అన్నీ పాన్ ఇండియా , భారీ బడ్జెట్ తో రుపొందుతుండడంవిశేషం .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టి – సిరీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “తానాజీ ” మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరో గా 3D ఫార్మట్ లో భారీ బడ్జెట్ తో “ఆదిపురుష్ ” మూవీ రూపొందనుంది. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో రావణబ్రహ్మ గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించనున్నారని సమాచారం. సీత గా “మహానటి “ఫేమ్ కీర్తి సురేష్ నటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న “ఆదిపురుష్ ” మూవీ కి భూషణ్ కుమార్ , కృష్ణ కుమార్ , ఓం రౌత్ , ప్రసాద్ సుతార్ , రాజేష్ నాయర్ నిర్మాతలు. “ఆదిపురుష్ ” మూవీ హిందీ తో పాటు తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషలతోపాటు కొన్ని ఫారిన్ లాంగ్వేజెస్ లో రిలీజ్ కానుంది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + nine =