సినీ కార్మికులకు చిరు మూడోసారి సాయం

Mega Star Chiranjeevi Distributes Groceries To Film Workers On Behalf Of Corona Crisis Charity Foundation Third Time In A Row

కరోనా వల్ల పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఎంతో మంది ఆర్ధికంగా దెబ్బతిన్నారు. కొంతం మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. ఇక సినిమా పరిశ్రమలో కూడా ఎంతో మంది రోడ్డున పడ్డారు. షూటింగ్స్ లేకపోవడంతో సినీ కార్మికుల పరిస్థితి దారుణంగా తయారైంది. అయితే ఏదో ఒక రకంగా వారిని ఆదుకోడానికి సినీ ప్రముఖులు ముందుకు వస్తూనే ఉన్నారు. ఎంతోమంది ప్రముఖులు ఇప్పటికే ఎన్నోకోట్ల రూపాయలు విరాళాలు అందించారు. ఇక మెగాస్టార్ సినీ కార్మికుల కోసం ఇప్పటికే చిరు కరోనా వైరస్ చారిటీ పేరుతో విరాళాలు సేకరించి వారికి అండగా నిలిచిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే వారికి రెండు విడతలు సాయం చేయగా ఇప్ప్పుడు మూడోసారి సాయం చేస్తున్నట్టు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ విషయాన్ని తెలియజేస్తూ మెగాస్టార్ చిరంజీవి ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. షూటింగ్‌లు ఇంకా ప్రారంభం కాకపోవడంతో సినీ కార్మికుల పరిస్థితి చాలా కష్టంగా ఉంది. అందుకే సీసీసీ తరఫున మూడో సారి కూడా వారికి సహాయం చేస్తున్నాం. వారికి అవసరమైన నిత్యావసర సరుకులను అందిస్తున్నాం. ఇప్పటికే పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు పదివేల మందికి అందిస్తున్నాం. ఈ క్లిష్ట పరిస్థితులు తాత్కాలికమే. త్వరలోనే మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటాం. అప్పటివరకు అందరూ ధైర్యంగా, ఆరోగ్యంగా ఉండాలని చిరంజీవి తెలిపారు.

 

ప్రస్తుతం చిరు, కొరటాల దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 40శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా.. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు ప్రస్తుతం బ్రేక్ పడింది. ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను చిరంజీవి పుట్టినరోజున రిలీజ్ చేయనున్నారు. ఆగష్ట్ 22న సాయంత్రం 4గంటలకు ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. కాగా ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు లూసిఫర్ సినిమా రీమేక్ కూడా చేయనున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 7 =