కరోనా వైరస్ ప్రభావం సినీ రంగంపై కూడా కాస్త ఎక్కువగానే పడింది. రాజమౌళి అండ్ ఫ్యామిలీ, తేజ, డి.వి.వి.దానయ్య, డైరెక్టర్ అజయ్ భూపతి సహా పలువురు సినీ సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడ్డారు. ఇక ఇటీవల ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంకు కూడా కరోనా రాగ ప్రస్తుతం చెన్నైలో ట్రీట్ మెంట్ జరుగుతుంది. ఇప్పుడు తాజాగా సింగర్ సునీతకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తను కోలుకున్నట్టు తెలిపింది సునీత.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నా గురించి తెలుసుకొని ఎంతోమంది ఫ్రెండ్స్, రిలేటివ్స్, సన్నిహితులు, మీడియా నుండి ఎందరో ఫోన్ చేశారు. వారందరికీ ధన్యవాదాలు. నాకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయంనిజమే.. ఇటీవల ఓ షూటింగ్‌లో పాల్గొన్న తర్వాత తలనొప్పి రావడంతో ఎందుకైనా మంచిదని.. టెస్ట్ చేయించాను. అందులో పాజిటివ్ అని నిర్థారణ అయింది. అప్పటి నుంచి వైద్యుల సూచనలు పాటిస్తూ.. హోమ్ ఐసోలేషన్‌లో ఉండి కేర్ తీసుకున్నాను. ప్రస్తుతం కోలుకుని, ఆరోగ్యంగా ఉన్నాను అని తెలిపింది. నాకు చాలా తక్కువ లక్షణాలు ఉండటం వల్ల .. త్వరగా కోలుకున్నాను. అయితే ఇప్పుడు నా బాధ అంతా బాలుగారి కోసమే. ఆయన త్వరగా కోలుకుని రావాలని మా ఫ్యామిలీ అంతా ప్రార్థిస్తున్నాము.. మనం వూహించుకున్నదానికంటే అది అంత ఈజీ కాదు అందరూ ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకోండి అంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేస్తూ తెలిపింది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: