అందాల “నిధి “

Ismart Girl Nidhhi Agerwal Shares About How She Has Celebrated Her Birthday This Year

బెంగుళూరు క్రైస్ట్ యూనివర్సిటీ లో నిధి అగర్వాల్ బిజినెస్ మేనేజ్ మెంట్ లో గ్రాడ్యుయేషన్ చేశారు. తెలుగు , తమిళ , కన్నడ భాషలలో ప్రావీణ్యం ఉన్న నిధి బాలెట్ , కథక్ , బెల్లీ డ్యాన్స్ లలో ట్రైనింగ్ తీసుకున్నారు. “మున్నా మైఖేల్ ” మూవీ తో బాలీవుడ్ లో సినీ కెరీర్ ప్రారంభించిన నిధి టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ ” మూవీ తో ప్రేక్షకులను అలరించి, గుర్తింపు పొంది , పలు మూవీ ఆఫర్స్ అందుకున్నారు. “భూమి ” మూవీ తో కోలీవుడ్ , “జేమ్స్ “మూవీ తో శాండల్ వుడ్ కు నిధి పరిచయం అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిధి అగర్వాల్ ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశోక్ గల్లా హీరోగా రూపొందుతున్న మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ నిధి , ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఫేస్ బుక్ లో 8.5 , ట్విట్టర్ లో 5 , ఇన్ స్టా గ్రామ్ లో 5 మిలియన్ ఫాలోవర్స్ తో సోషల్ మీడియా లో నిధి దూసుకుపోతున్నారు. ఫిట్ నెస్ గురించి నిధి మాట్లాడుతూ .. లాక్ డౌన్ సమయం తనకు చాలా ఉపయోగపడిందని , వర్కౌట్స్ , యోగా లతో తన శరీరాకృతి మరింత మెరుగుపడిందని , ఆగస్ట్ 17 వ తేదీ తన బర్త్ డే ను ఫ్యామిలీ , క్లోజ్ ఫ్రెండ్స్ తో జరుపుకున్నానని , బర్త్ డే రోజున ఫ్యామిలీతో కలసి ఉండడం ఒక కల తీరినట్టుగా ఉందని , త్వరలో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించనున్నానని నిధి తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.