‘ఆదిపురుష్’ లో ప్రభాస్ పాత్ర చెప్పేసిన నాగ్ అశ్విన్

Nag Ashwin Reveals Prabhas Role In Adipurush

బాహుబలి సిరీస్ కు ముందు ప్రభాస్ రేంజ్ వేరు.. బాహుబలి సిరీస్ తర్వాత వేరు.. ఈ సిరీస్ తో ప్రభాస్ స్థాయి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి పెరిగిపోయింది. ఒక గ్యాంగ్ స్టర్ అయినా లవర్ బాయ్ అయినా ఒక యోధుడిగా అయినా ఇలా ఒక్కటేంటి అన్ని రోల్స్ కు కూడా ప్రభాస్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. ఇక ఇప్పుడు ఏదో నాలుగు ఫైట్ లు నాలుగు పాటలు ఉన్న సినిమాలు చేయడానికి లేదు ప్రభాస్. ప్రభాస్ నుండి కూడా అలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేసే రోజులు పోయాయి. అందుకే ఇప్పుడు భారీ సినిమాలనే లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో భారీ అండ్ పాన్ ఇండియాగా ‘రాధేశ్యామ్’ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు. ఇది కూడా భారీ బడ్జెట్ సినిమానే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రభాస్ 22 సినిమా ప్రకటన కూడా వచ్చేసింది. అదేంటో ఎలాంటి హడావుడి లేకుండా చాలా సైలెంట్ గా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ ఒక వైపు షాకైన.. తమ హీరో కొత్త సినిమా అప్ డేట్ ఇచ్చినందుకు ఆనందంలో ఉన్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆది పురుష్’ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమా పోస్టర్ ను బట్టి ఇప్పటికే ఇది రామాయణం నేపథ్యంలో తెరెకెక్కుతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు నాగ్ అశ్విన్ చేసిన ట్వీట్ బట్టి చూస్తే అది నిజమే అన్న క్లారిటీ వచ్చేస్తుంది. ఈ సినిమా ప్రకటనపై స్పందించిన నాగ్ అశ్విన్ రాముని పాత్రలో మిమ్మల్ని చూడటానికి చాలా ఆతృతగా ఎదురుచూస్తున్న.. ఇప్పటివరకూ చాలా కొంతమంది మాత్రమే ఆ పాత్రలో నటించారు ఆల్ ద బెస్ట్ టీమ్ అంటూ.. తన ట్వీట్ లో పేర్కొన్నారు.

 

కాగా ఈ సినిమాను ఆదిపురుష్ టీమ్ 2021లో పట్టాలెక్కించి 2022 లోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మరి ఇప్పటికీ రాధే శ్యామ్ షూటింగ్ పూర్తి కాలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎపుడు మొదలవుతుందో కూడా తెలీదు. ఇంకా నాగ్ అశ్విన్ సినిమా కూడా లైన్ లో వుంది చూద్దాం మరి ఏం జరుగుతుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 4 =