రానా-మిహిక ల పెళ్లి నిన్న జరిగిన సంగతి తెలిసిందే. ఇక దాదాపుగా నాలుగైదు రోజుల నుండి వీరి పెళ్లి హడావుడి చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ కొద్ది మంది అతిధుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు కాకా ఇంకా ఇండస్ట్రీ నుండి తన బెస్టీస్ రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్‌తో పాటు కొద్ది మంది ఈ వేడుకకి హాజరైనట్టు తెలుస్తుంది. ఇప్పటికే వీరిద్దరి పెళ్ళికి సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మిహికా కాస్ట్యూమ్స్ ప్రత్యేక ఆకర్షణ అని చెప్పొచ్చు. హల్దీ వేడుక, మెహందీ వేడుకల్లో మిహికా దుస్తులు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఇక పెళ్ళికి గోల్డ్ మరియు క్రీమ్ కలర్‌లో ఎంతో అందంగా ఉన్న లెహంగా ఇంకా ఆకర్షించింది. మిహికా ధరించిన లెహంగాని ప్రముఖ డిజైనర్ అనామికా ఖన్నా డిజైన్ చేసినట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా మిహికా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఫోటో షేర్ చేసింది. దానికి ఇప్పుడు మాది కుటుంబం అని కామెంట్ పెట్టింది. ఫోటోలో రానా, మిహికాలు నవ్వుతుండగా… వీరిద్దరితో పాటు వారి పెంపుడు కుక్క కూడా ఫోటోలో ఉంది.




ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా విరాటపర్వం 1992 అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా కొంత షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా కనిపించనున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: