నేనెంతో అదృష్టవంతుడిని..!

Super Star Mahesh Babu Writes A Heart Felt Note Thanking Everyone On Social Media

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు జరిగిన సంగతి తెలిసిందే. ఇక మహేష్ అభిమానులు తమ అభిమాన హీరోకు ఎలాంటి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారో తెలుసు. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు తమ ట్విట్టర్‌లో #HBDMaheshBabu హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేశారు. ఇక ఈ ట్యాగ్ 60.2 మిలియన్ ట్వీట్స్‌తో 24 గంటల్లో ప్రపంచంలోనే అత్యధికంగా ట్వీట్ చేయబడిన హ్యాష్ ట్యాగ్‌‌గా రికార్డ్ సృష్టించింది. ఇంకా టాలీవుడ్ నుండి ఎంతోమంది సెలెబ్రిటీస్ మహేష్ కు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా తనకు విషెస్ చెప్పిన వారికి… తన అభిమానులకు మహేష్ తన ట్విట్టర్ ద్వారా థ్యాంక్స్ చెప్పాడు. ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు, మీరందరూ నా మీద చూపించే ఈ ప్రేమ నేనెంత అదృష్టవంతుడినో నాకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఎంతో అభిమానంగా పంపిన మీ విషెస్ చదువుతుంటే చాలా ఆనందంగా ఉంది. నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు మరియు ఫ్యాన్స్‌కు మీరు పంపిన అభినందనలకు, దీవెనలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. – ప్రేమతో మీ మహేష్ బాబు అని మహేష్ బాబు ట్వీట్ చేశారు.

 

ప్రస్తుతం మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ అనే సినిమాలో నటిస్తున్నాడు. గీతా గోవిందం ఫేం పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్నఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =