మెగా స్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ను సూపర్ హిట్ “చిరుత ” మూవీ తో దర్శకుడు పూరి జగన్నాథ్ టాలీవుడ్ కు హీరోగా పరిచయం చేసిన విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ ను స్క్రీన్ పై పూరి జగన్నాథ్ అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. రామ్ చరణ్ పెర్ఫార్మెన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటివరకూ వారిద్దరి కాంబినేషన్ లో ఏ మూవీ రూపొందలేదు. 13 సంవత్సరాల తరువాత ఒక మూవీ సెట్ అయ్యిందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఒక మూవీ రూపొందనుందని , పూరి కథకు రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని , ప్రముఖ నిర్మాత కె ఎస్ రామారావు ఈ మూవీ ని నిర్మించనున్నారని సమాచారం. హీరో రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న “రౌద్రం రణం రుధిరం “మూవీ లో నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా మూవీ “ఫైటర్ ” మూవీ ని పూరి జగన్నాథ్ రూపొందిస్తున్నారు. పూరి జగన్నాథ్ , రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో మూవీ అనగానే అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: