రానా పెళ్లికి కరోనా టెస్ట్..!

Rana Daggubati and Miheeka Bajaj Lavish Wedding Will Be Celebrated Strictly Abiding To Corona Virus Guidelines

టాలీవుడ్ లో హీరోలు ఒకరి తర్వాత ఒకరు పెళ్లి పీటలెక్కుతున్నారు. ఇప్పటికే నితిన్, నిఖిల్ సింపుల్‌గానే పెళ్లి చేసుకున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ సింపుల్ గా పెళ్లి కానిచ్చేశారు. ఇప్పుడు మరికొందరు హీరోలు కూడా పెళ్లి వైపు అడుగులేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెళ్లి ఏదైనా ఉంది అంటే అది రానా పెళ్లి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. హిందూ సంప్రదాయంలో ఈనెల 8వ తేదీన రానా మిహికా ల వివాహం జరగనుంది. రానా దగ్గుబాటి, మిహికా వివాహానికి వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామానాయుడు స్టూడియోలోనే వీరి వివాహం జరగనున్నట్టు తెలుస్తుంది. తాజాగా రానా పెళ్లిపై మాట్లాడిన రానా తండ్రి సురేష్ బాబు.. కరోనా రోజు రోజుకు పెరుగుతున్న తరుణంలో అందరి ఆరోగ్యం దృష్ట్యా వివాహానికి ఎక్కువమందిని ఆహ్వానించడంలేదని.. తమ సన్నిహితులు.. సినీ పరిశ్రమకు సంబంధించి కేవలం 30మంది మాత్రమే పెళ్ళికి వస్తారని తెలిపారు. అంతేకాదు రానా పెళ్ళికి వచ్చే వాళ్ళు కరోనా టెస్ట్ కూడా చేయించుకొని పెళ్ళికి హాజరు కానున్నట్టు తెలుస్తుంది.

మిహిక నా ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ రానా సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో రానా పెళ్లి తెరపైకి వచ్చింది. ఆ తర్వాత ఇరు కుటుంబాలు కలిసి మాట్లాడుకోవడం.. పెళ్ళి ఫిక్స్ చేయడం ఆ తర్వాత రోకా వేడుక జరిగింది.

ఇక రానా సినిమాల విషయానికి వచ్చేసరికి.. ప్రస్తుతం రానా అరణ్య అనే ఓ సినిమాలో నటిస్తున్నాడు. విడుదలకి సిద్దంగా ఉన్న ఈ సినిమా కరోనా వలన వాయిదా పడింది. ఇక ఈ సినిమాతో పాటుగా విరాటపర్వం అనే సినిమాని చేస్తున్నాడు రానా.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + six =