నాని ‘జెర్సీ’ కి అరుదైన ఘనత – భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి ఎంపిక

Natural Star Nani Sports Drama Jersey Movie To Feature At International Film Festival

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరోహీరోయిన్లు గా తెరకెక్కిన సినిమా జెర్సీ. ఓ క్రికెటర్ తన ఆటను మెరుగు పరచుకొని ఏ విధంగా గెలుపు సాధించాడు. జీవితంలో అతను ఓడి ఎలా గెలిచాడు అనేదే ఈ సినిమా కథ. 2019 ఏప్రిల్ 19న విడుదలైన ఈ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడమే కాదు… విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఇక ఈ సినిమాలో నాని నటన అయితే కంటతడి పెట్టిస్తుంది. నాచ్యురల్ స్టార్.. ఈ సన్నివేశాన్ని అయినా సహజంగా నటించగలడు.. ఇక ఈ సినిమాలో ఎమోషనల్ సన్నివేశాల్లో నాని చేసిన నటన అద్భుతం. నానికి కొడుకుగా చేసిన రోనిత్ కూడా చాలా బాగా నటించాడు. సత్యరాజ్, రావు రమేష్, ప్రవీణ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.

ఇప్పుడు ఈ సినిమాకు మరో ఘనత దక్కింది. భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ‘జెర్సీ’ చిత్రం ఎంపికైంది. ఆగస్టు 9 నుంచి, 15 వరకు జరిగే ఈ చిత్రోత్సవంలో ‘జెర్సీ’ సినిమా ప్రదర్శన చేయనున్నారు.

ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్న సంగతి కూడా తెలిసిందే. అర్జునరెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన షాహిద్ కపూర్ ఈ రీమేక్ లో నటిస్తున్నాడు. గతంలోనే ఈ సినిమా కోసం షాహిద్ కపూర్ ప్రాక్టీస్ కూడా చేసాడు. తెలుగులో డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి ఏ దర్శకత్వం వహించనున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here