లేటెస్ట్ అప్ డేట్స్ ‘వీక్లీ రౌండప్’ మీకోసం

TFN Weekly Round-Up: Latest Telugu Movie Updates

గత వారం రోజుల్లో ఎన్నో సినిమా వార్తలు ‘దితెలుగుఫిలింనగర్ .కమ్’ ద్వారా మీకు అందించాం. ఈ వారంలో ఎన్నో విశేషాలు చోటు చేసుకున్నాయి. మరి ఆ అప్ డేట్స్ లో మీరేమైనా ముఖ్యమైన అప్ డేట్స్ మరిచిపోయారా? అయితే ఈ వీక్లీ రౌండప్ మీకోసం. ఈవారం వార్తలపై మీరొక లుక్కేయండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కొరటాల-బన్నీ సినిమా అధికారిక ప్రకటన

కొరటాల-బన్నీ సినిమాపై అధికారిక ప్రకటన ఇచ్చారు. యువ సుధ ఆర్ట్స్‌, జీఏ2 పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై సుధాక‌ర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. శాండీ, స్వాతి, న‌ట్టి స‌హ నిర్మాత‌లుగా వ్య‌వ‌హరిస్తున్నారు. 2021 ద్వితీయార్ధం నుండి ఈ సినిమా షూటింగ్ జరిపి 2022 ప్ర‌థ‌మార్థంలో సినిమాను విడుద‌ల చేస్తామని కూడా తెలిపారు.

‘కె.జి.యఫ్ 2’ నుండి ‘అధీర’ లుక్ రిలీజ్ ..!

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా ‘కె.జి.యఫ్ 2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే జులై 29 న సంజయ్ దత్ పుట్టినరోజు కావడంతో ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2’లోని అధీరా లుక్‌ను విడుద‌ల చేసింది. ఇక చెప్పేదేముంది పేరుకు తగ్గట్టే అధీర లుక్ చాలా భయంకరంగా ఉంది.

హను రాఘవపూడి-దుల్కర్ సినిమా ప్రకటన

హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ నటిస్తున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ వార్తలను నిజం చేస్తూ అధికారిక ప్రకటన ఇచ్చారు. జులై 28 దుల్క‌ర్ స‌ల్మాన్‌ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆ సినిమా కాన్సెప్ట్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. లెఫ్టినెంట్ రామ్ అనే సైనికుడి ప్రేమ‌క‌థ‌ను సినిమా రూపంలో తెర‌కెక్కించ‌నున్నారు. తెలుగు, త‌మిళ, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈసినిమా రూపొంద‌నుంది. పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరిగా ఈ సినిమా తెరకెక్కనుంది.

వెటరన్ నటుడు రావి కొండలరావు మృతి

వెటరన్ నటుడు రావి కొండలరావు జులై 28న తుది శ్వాస విడిచారు. గుండెపోటు కు గురైన రావి కొండలరావు హైదరాబాద్‌లోని వివేకానంద ఆసుపత్రిలో చేరిపించగా.. అక్కడ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై టాలీవుడ్ పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.

#NS20 ఫస్ట్ లుక్ రిలీజ్

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా విలువిద్య నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా #NS20 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. దర్శకుడు శేఖర్ కమ్ముల చేతుల మీదుగా #NS20 మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఈరోజు రిలీజ్ అయ్యింది. కండలు తిరిగిన దేహంతో విల్లు ఎక్కుపెట్టిన నాగశౌర్య ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

హిందీ ‘అల వైకుంఠపురములో’ జాన్వీ కపూర్?

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , పూజాహెగ్డే జంటగా రూపొందిన “అల .. వైకుంఠపురములో సినిమా ఎంత ఘనవిజయం సాధించిందో తెలుసు. ఇక ఇప్పుడు ఈ సినిమాను హిందీలో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ లో జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా ఎంపిక చేయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది.

జక్కన్నకు కరోనా

ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీస్ కు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి కి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని రాజమౌళినే స్వయంగా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం వారు హోమ్ క్వారెంటైన్ లో ఉన్నారు.

21 ఏళ్ళ ‘రాజకుమారుడు’ 11 ఏళ్ళ ‘మగధీర’

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందిన రొమాంటిక్ కామెడీ “రాజకుమారుడు “మూవీ 1999 సంవత్సరం జులై 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. జులై 30, 2020 తో ఈ సినిమా 21 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందిన ఫాంటసీ , యాక్షన్, రొమాంటిక్ డ్రామా “మగధీర ” మూవీ 2009 సంవత్సరం జులై 1 వ తేదీ రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా జులై 31 2020 తో 11 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.