రన్నింగ్ అందుకే చేస్తా నేను..!

Actress Shruti Haasan Reveals The Reason Behind Her Running Habbit

ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా చెప్పే అలవాటు శ్రుతి హాసన్ ది. ఇటీవలే తన ప్లాస్టిక్ సర్జరీ గురించి కూడా చెప్పి టాక్ ఆఫ్ డ్ టౌన్ అయింది ఈ ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుతం శృతి హాసన్ హైద్రాబాద్లో ఉన్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ తీసేసినప్పుడే ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడే హోమ్ క్వారంటైన్ లో వుంటూ అప్పుడప్పుడు జాగింగ్ చేస్తూ కూడా కనిపించిన సందర్భాలు వున్నాయి. ఇక సోషల్ మీడియాలో కూడా శృతి హాసన్ యాక్టీవ్ గానే ఉంటది. తన ఫొటోలు కానీ వర్కౌట్స్ కు సంబంధించిన వీడియోలు కానీ ఏదో ఒకటి పోస్ట్ చేస్తూనే ఉంటుంది.

ఇక ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి హాసన్ ఫిట్ నెస్ పై పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. ఒక చిన్న వర్క్ మీద నేను హైదరాబాద్ కు వచ్చాను.. ఇక్కడ ఉన్నా కూడా ఇంట్లో ఉన్న ఫీలింగే ఉంటుంది.. ఇక్కడ మంచి ప్లేస్ లో ఉన్నా.. ఎప్పుడు కావాలంటే అప్పుడు రన్నింగ్ కు వెళ్లొచ్చు.. ఫిట్ గా ఉండటానికి నేను రన్నింగ్ చేస్తుంటా అని తెలిపింది. అంతేకాదు.. మెంటల్ స్ట్రెస్ కూడా తగ్గిస్తుంది. నేను ఎక్కువగా ఒత్తిడి, ఆందోళనకు గురవుతుంటా..రన్నింగ్, వర్కౌట్స్ నన్ను రిలాక్స్డ్ గా ఉంచుతాయి అని చెప్పింది. ఇంకా తన మెంటల్ స్ట్రెస్ గురించి మాట్లాడుతూ.. ఒకప్పుడు నేను ఈ టాపిక్ గురించి మాట్లాడాలంటే భయపడేదాన్ని.. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అని ఫీల్ అయ్యేదాన్ని కానీ ఇప్పుడు అలా కాదు.. దీని గురించి అవెర్నెస్ తీసుకురావాలని చెపుతున్నా అని చెప్పుకొచ్చింది ఈ భామ.

ప్రస్తుతం శృతి హాసన్ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న “క్రాక్ ” మూవీ నటిస్తుంది. ఎస్పీ జననాథన్ దర్శకత్వం వహిస్తున్న లాభం అనే సినిమాలో కూడా శృతిహాసన్ నటించనుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.




Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here