రీతు వర్మ Exclusive Interview – వాళ్లే నన్ను బెస్ట్ యాక్ట్రెస్ గా చేశారు

Ritu Varma Exclusive Interview

పెళ్లి చూపులు సినిమాతో హీరోయిన్ గా మారి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది రీతు వర్మ. ఈ సినిమాతో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది. తెలుగులో రీతు వర్మ చివరి సినిమా కేశవ. కేశవ తర్వాత తెలుగులో కాస్త అవకాశాలు తగ్గడంతో తమిళ్ లో బిజీ అయింది ఈ అమ్మడు. రీసెంట్ గా కనులు కనులు దోచాయంటే అనే సినిమాతో దాదాపు మూడేళ్ల తర్వాత తెలుగులో హిట్ కొట్టింది. దీనితో మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసింది. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న రీతు వర్మ ‘దతెలుగుఫిలింనగర్.కామ్’ ఛానల్ లో ఇంటర్వ్యూ లో పాల్గొని పలు ఆసక్తికర విషయాలు తెలిపింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగులో మీ లాస్ట్ మూవీ కేశవ.. 2017లో వచ్చింది.. ఇప్పుడు 2020 లో ‘కనులు కనులు దోచాయంటే’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇంత లాంగ్ గ్యాప్ ఎలా వచ్చింది..?

నిజానికి కావాలని తీసుకున్న గ్యాప్ కాదు…ఏ నటీనటుడైనా ఇంత లాంగ్ గ్యాప్ తీసుకోవాలనుకోరు..పెళ్లి చూపులు తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయి.. కొన్ని నాకు నచ్చిన కథలు ఉన్నాయి కానీ అనుకోనికారణాల వల్ల అవి చేయలేకపోయాను. తమిళ్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫిలింస్ చేశాను.. అవి కూడా అనుకోకుండా లేట్ అయ్యాయి. అయితే లాస్ట్ ఇయర్ ఎండింగ్ మాత్రం నాకు బాగా కలిసొచ్చింది. శర్వానంద్ తో ఒక సినిమా.. నాని చేస్తున్న ‘టక్ జగదీష్’, నాగశౌర్య తో ఒక సినిమా.. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో మరో సినిమా చేస్తున్నాను. సో కావాలని తీసుకున్నదేం కాదు.. దేనికైనా టైం రావాలి అంతే.

ఇక ఈ ఏడాది నాలుగు సినిమాలు రిలీజ్ అవుతాయేమో అనుకున్నా.. చాలా ఎక్సైట్ తో ఉన్నా.. కానీ మళ్లీ కరోనా వల్ల లేట్ అవుతున్నాయి. ప్లాన్స్ మొత్తం చేంజ్ అయిపోయాయి. ఏం చేయలేం కానీ ఇయర్ ఎండింగ్ అయినా అందరికీ మంచిగా ఉండాలి.

‘కనులు కనులు దోచాయంటే’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయినప్పుడు రొమాంటిక్ కామెడీ అనుకున్నారు. కానీ ఈ సినిమాలో మీ పాత్ర అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది.

అవును..ఈ సినిమాలో నా పాత్ర అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది. డైరెక్టర్, చిత్రయూనిట్ మొత్తం నా రోల్ ను సస్పెన్స్ గా ఉంచాలనే రివీల్ చేయలేదు..నా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ సినిమా చూసినప్పుడు క్లైమాక్స్ చూసి అరుచుకుంటూ మరీ ఎంజాయ్ చేశారు..

ఈ సినిమా కోసం బైక్ రైడ్ నేర్చుకున్నారా..?

అవును.. ఈ సినిమా కోసం బైక్ రైడ్ నేర్చుకున్నా.. అప్పటివరకూ నాకు బైక్ నడపడం రాదు.. అందులోనూ అది రాయల్ ఎన్ఫీల్డ్… చాలా బరువు వుంది.. దుల్కర్ హెల్ప్ తో డ్రైవ్ చేసేసా..

పెళ్లిచూపులు సినిమా మీకు మంచి ఫేమ్ ను తెచ్చిపెట్టింది. విక్రమ్, దుల్కర్ సల్మాన్, నాని లాంటి పెద్ద స్టార్స్ తో పనిచేసే అవకాశం దక్కింది. ఎలా ఫీల్ అవుతున్నారు..?

ఒక్కోసారి ఇది నిజమేనా అన్న ఫీలింగ్ వస్తుంది.. నాకు అసలు సినిమాలు వస్తాయి అని కూడా అనుకోలేదు.. కానీ ఇప్పుడు వారితో కలిసి పనిచేస్తున్నాను. కల నిజం అవ్వడం అంటే ఇదే.. ప్రతి సినిమా నుండి నేను ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు నేను కాన్ఫిడెంట్ యాక్ట్రెస్ ను అని చెప్పొచ్చు. ప్రతి సినిమా నన్ను బెస్ట్ యాక్ట్రెస్ గానే చేసింది.. నన్ను నేను బెటర్ గా చేసుకోడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను.. ఒక గౌతమ్ మీనన్, దుల్కర్ సల్మాన్, విక్రమ్ లాంటి వాళ్ళు బెస్ట్ యాక్ట్రెస్ గా చేశారు.

కెరీర్ స్టార్టింగ్ లో ఇండస్ట్రీ ఎలా ఉంటుంది… మనుషులు ఎలా వుంటారు… అసలు హీరోయిన్స్ మేనేజర్స్ ను ఎందుకు పెట్టుకుంటారు అన్న కాన్సెప్ట్ ఇలా ఏం తెలియదు. ఇప్పుడు చాలా వరకూ నేర్చుకున్నా..!

‘కనులు కనులు దోచాయంటే’ సినిమాలో మీ రోల్ అందరినీ సర్ప్రైజ్ చేసింది. మరి అప్ కమింగ్ సినిమాల్లో మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు..?

అవును.. ప్రతి సినిమాలో నేను డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలనే చూసుకున్నాను.. ఇప్పుడు నేను చేసే సినిమాల్లో కూడా ప్రతి సినిమాలో నా పాత్ర డిఫరెంట్ గానే ఉండేలా చూసుకున్నా. మంచి మంచి ఇంట్రెస్టింగ్ పాత్రలతో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయాలనే నేను కూడా కోరుకుంటున్నా..

మీ ఫోన్ లో ఒక పనికొచ్చే యాప్.. ఒక పనికిరాని యాప్ ఏమున్నాయి..?

ప్రస్తుతం నాకు నేను బాగా వాడే.. నాకు బాగా ఉపయోగపడే యాప్ డైలీ యోగా యాప్. రీసెంట్ గానే యోగా చేయడం స్టార్ట్ చేసాను ఇప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాయి. ఉపయోగపడని యాప్ ఏదైనా ఉందా అంటే అది క్యాండీ క్రష్. నేను పెద్దగా గేమ్స్ ఆడను.

ప్రస్తుతం లాక్ డౌన్ నడుస్తుంది కదా.. మూడు మాటల్లో లాక్ డౌన్ గురించి చెప్పాలంటే ఏం చెపుతారు..?

అవసరం, లైఫ్ ఛేంజింగ్ ఇంకా కనెక్టింగ్. ఈ లాక్ డౌన్ నాలో ఉన్న ఆర్టిస్ట్ ను మరోసారి బయటకు తీసుకొచ్చింది. ఈ గ్యాప్ లో చాలా పెయింటింగ్స్ చాలా డ్రాయింగ్స్ వేసాను. ఇంకా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో టైంను స్పెండ్ చేసే అవకాశం కలిగింది.. అంతేనా ఈ లాక్ డౌన్ వల్ల ఎన్నో ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నా.. మన లైఫ్ లో మనం అన్నీ కలిగి ఉన్నామంటే మనం అదృష్టవంతులమే.

మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే ఒక యాక్టర్, యాక్ట్రెస్ పేరు చెప్పండి..?

అలియా భట్.. తన వర్క్ ఇంకా తను సినిమాలు ఎంచుకునే విధానం నిజంగా నాకు నచ్చుతుంది. ఇంకా మెరీల్ స్ట్రీప్ కూడా ఇష్టం.

ఒక హీరోయిన్ గా మీరు వర్క్ చేస్తున్నారు. ఎప్పుడూ ఫిట్ నెస్ మైంటైన్ చేస్తూనే ఉండాలి. కొన్ని కొన్ని సార్లు దీనివల్ల మీకు ప్రెషర్ అనిపించిందా..?

నిజమే చాలా ప్రెషర్ ఉంటుంది. అయితే అది మనమీదే ఆధారపడి ఉంటుంది. ఇండస్ట్రీలో పనిచేస్తున్నామంటే మన లుక్ ను పర్ఫెక్ట్ గా మైంటైన్ చేయడం అనేది ప్రధానం.. అలావుంటేనే ఇండస్ట్రీలో నెగ్గుకురాగలం. ఫైనల్ గా అది మన మీదే డిపెండ్ అయి ఉంటుంది. మనం నార్మల్ గా ఉంటే ఓకే అదే మనం హెడ్ కు ఎక్కించుకుంటే ఖచ్చితంగా ప్రెషర్ ఫీలింగే వస్తుంది.

మీకు ఎవరి బయోపిక్ లో అయినా నటించమని అవకాశం వస్తే ఎవరి బయోపిక్ లో నటిస్తారు?

పాత తరం యాక్ట్రెస్ మధుబాల గారి బయోపిక్ లో నటిస్తా. కాని ఆమె పాత్రలో నటించాలంటే.. ఆ పాత్రకు న్యాయం చేయాలంటే మాత్రం చాలా కష్టం.

లైఫ్ మిమ్మల్ని ఏదైనా కోరుకోమని వరం ఇస్తే మీరు ఏం కోరుకుంటారు?

ఇంకా చాలా వరాలు కావాలని కోరుకుంటాను. మనుషులుగా మనం ఆశావాదులం. సో ఒక కోరిక అంటే చాలా కోరికలతో సమానం.

మీరు ఎప్పుడు చూసినా మీకు బోర్ కొట్టని ఒక సినిమా లేకపోతే ఒక వెబ్ సిరీస్ ఏంటి?

‘Home Alone’ సిరీస్ కు నేను పెద్ద ఫ్యాన్ ని. Home Alone2 నా మోస్ట్ ఫేవెరెట్ సినిమా. నేను ఎప్పుడు చూసినా.. బోర్ ఫీల్ అవ్వను. నేను నా సిస్టర్ ప్రతి క్రిస్టమస్ కు ఈ సినిమా పెట్టుకొని చూస్తాం.అదొక ట్రెడిషన్ లా అయిపోయింది.

ఇంకా పలు ఇంట్రెస్టింగ్ సినిమాలతో.. సూపర్ హిట్స్ తో రీతు వర్మ కెరీర్ లో దూసుకుపోవాలని కోరుకుందాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here