2020 సినీ పరిశ్రమకు అస్సలు కలిసిరాలేదని ఇప్పటికే పలు వార్తలు వస్తూనే ఉన్నాయి. చూడబోతే అది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే పలు సినీ ఇండస్ట్రీల నుండి పలువురు సినీ ప్రముఖులు వరుసగా మృతి చెందుతున్నారు. ఇటీవలే కన్నడ పరిశ్రమకు చెందిన యంగ్ హీరో చిరంజీవి సర్జా మృతి చెందగా.. అది మరిచిపోయేలోపే బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సింగ్ ఇప్పుడు మలయాళ పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు మృతి చెందాడు. మలయాళ దర్శక నిర్మాత కె.సచిదానంద్(సచి) గుండెపోటుతో కన్నుమూశారు. ఆర్థోపెడిక్ సమస్యతో బాధపడుతున్న ఆయనకు హిప్ రీప్లేస్‌మెంట్ ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ తర్వాత గుండెపోటు రావడంతో ఆయన్ని త్రిచూర్ హాస్పిటల్‌కు తరలించారు.అయితే అక్కడ చికిత్స పొందుతూనే సచి మృతి చెందినట్టు తెలుస్తుంది. సచి మృతితో సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. మలయాళ ఇండస్ట్రీ టాలెంటెడ్ డైరెక్టర్ ను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక దర్శక నిర్మాతగా సచి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. గత ఏడాది ఈయన తెరకెక్కించిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమా ఘన విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమా రీమేక్ హక్కులను సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఎప్పుడో సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో యంగ్ హీరో రానా దగ్గుబాటి మాస్ మహారాజ్ రవితేజ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ‘స్వామిరారా’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ వర్మకు ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను ఆగస్టు నుంచి మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: