పాత జ్ఞాపకాలు – ‘పెదరాయుడు’ సినిమా ఆసక్తికర విషయాలు..!

Tollywood Actor Mohan Babu Recounts Some Memories Of His Timeless Classic Pedarayudu Movie On Its 25th Year Of Movie Release
Tollywood Actor Mohan Babu Recounts Some Memories Of His Timeless Classic Pedarayudu Movie On Its 25th Year Of Movie Release

రజనీకాంత్, మోహన్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘పెదరాయుడు’ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో.. ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కలెక్షన్ల పరంగానూ కలెక్షన్ కింగ్ సెన్సేషన్ క్రియేట్ చేశారు. కుటుంబ విలువల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మోహన్ బాబు సినీ కెరీర్లో ఈ సినిమా ఓ మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. 15 జూన్ 1995న విడుదలైన ఈ సినిమా ఈ రోజుతో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నిజానికి ఈ సినిమా తమిళ్ ‘నటామై’ సూపర్ హిట్ సినిమాకు రీమేక్. తమిళనాట కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో, శరత్ కుమార్, విజయ్ కుమార్, ఖుష్బూ, మీనా తదితరులు ప్రధాన పాత్రలో నటించగా 1994లో విడుదలై సంచలన విజయం సాధించిన ఈ సినిమాకు రీమేక్ గా ‘పెదరాయుడు’ సినిమా తెరకెక్కింది. తెలుగులో రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించగా… శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై మోహన్ బాబు నటించి, నిర్మించారు. ‘పెదరాయుడు’ పాతికేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు మోహన్ బాబు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

1995 లో పెదరాయుడు సినిమా తీసాం.. సినిమా పరిశ్రమ మొదలై అప్పటికి 50-60 సంవత్సరాలు అయివుండొచ్చు.. అన్ని సంవత్సరాల్లో ‘పెదరాయుడు’ చేసినటువంటి కలెక్షన్స్ ఏ సినిమాలు చేయలేదు ఇది వాస్తవం. ఎన్నో సందర్భాల్లో ఈ విషయాన్ని మా గురువుగారు.. అన్నయ్య రామారావుగారు చెప్పారు. ఫస్ట్ ప్రివ్యూ షో కూడా అన్నగారికి చూపిస్తే.. అద్భుతం బ్రదర్ ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధిస్తుంది అని చెప్పారు. ఇదంతా దైవాదీనమే. రజినీకాంత్ తమిళ్ నాటమై సినిమా చూసి నాకు ఫోన్ చేసి మద్రాస్ రమ్మన్నాడు. నేను అక్కడికి వెళ్లిన వెంటనే.. నాటామై సినిమా చూసాను చాలా బాగుంది.. ఈ సినిమా రైట్స్ మాట్లాడుకో.. నేను అయితే ఆయనకు చెప్తాను ఈ సినిమా రైట్స్ కావాలని.. ముందు సినిమా అయితే చూడు అని అన్నారు. నేను సినిమా చూసి బావుంది అని చెప్పాను.. ఇక ఆ సినిమా నిర్మాత ఆర్.బి చౌదరి దగ్గరికి వెళ్ళాను.. ఆయన రజినీకాంత్ గారు చెప్పారు.. అయన చెప్పిన తర్వాత ఏముంది.. రైట్స్ ఇస్తాను తీసుకోండి అని అన్నారు. ఇక ఆయనొక రేట్ చెప్పారు.. మేమొక రేట్ చెప్పాం.. ఫైనల్ గా రైట్స్ ను దక్కించుకున్నాం.

ఇక ఈ సినిమాకు డైరెక్టర్ రవి రాజా పినిశెట్టి. తాను నేను మంచి స్నేహితులం. ఈ సినిమాకు డైరెక్షన్ చేయమని అడిగా.. ఒకసారి సినిమా చూడమని చెప్పా.. తాను సినిమా చూసి బాబు అంతా బానే వుంది నాకు ఒక రోజు టైం ఇవ్వండి అని అడిగాడు.. అయితే రజనికి నచ్చింది.. నాకు నచ్చింది.. నీకు నచ్చింది ఇంకెందుకు ఒక రోజు.. ఏదైనా మార్పులు ఉంటే చేసుకోవచ్చు కదా అని అన్నా.. అయినా ఒక రోజు టైం కావాలని అడిగాడు.. దానితో నాకు కోపం వచ్చి అప్పటికే అసెంబ్లీ రౌడీ సినిమా చేసిన బి. గోపాల్ ను చెప్పా. తను సినిమా చూడకుండానే వేరే సినిమా ఉందంటూ తప్పించుకున్నాడు. ఒక మరుసటి రోజు రవి రాజా వచ్చి నేను చేస్తాను సినిమా అన్నాడు. ఇంకా అన్నీ సెట్ అయిపోయాయి. అయితే పెదరాయుడు పాత్ర ఒకటి మిగిలిఉంది. అప్పుడు రజినీకాంత్ కు ఫోన్ చేశా. అనీ కుదిరాయిరా.. పెదరాయుడు పాత్ర ఒకటి వుంది అని.. ఆలోచిస్తున్నాం అని చెప్పా.. అప్పడు నువ్వు ఆలోచించేది ఏంట్రా.. ఈ పాత్ర నేను చేస్తా.. నిన్ను ఈ సినిమా తీసుకోమని చెప్పింది ఎందుకు తెలుసా ఆ క్యారెక్టర్ నేను చేద్దామని అని చెప్పాడు. ఈ విషయం రవిరాజా కి చెప్పగా ఆయన కూడా షాక్ అయ్యాడు. ఇక అలా ఈ సినిమాలో పెదరాయుడు పాత్రలో రజినీ చేసాడు. ఆ తర్వాత నటీనటులు అందర్నీ ఎంపిక చేసాం. టైటిల్ ఏం పెడదాం అన్నా. ‘పెదరాయుడు’ పెట్టమన్నాడు. అయితే నేను ఈ టైపు లో ఇంతకుముందు సినిమాలు వచ్చినాయి కానీ ఆడలేదు కదా అన్నా.. నువ్వు పెట్టరా సినిమా సూపర్ హిట్ అవుతుంది అన్నారు. నెక్స్ట్ ఓపెనింగ్. మా అన్నయ్య ఎన్టీఆర్, మా గురువు గ్గారు దాసరి నారాయణ రావు గారు, సుబ్బిరామి రెడ్డి ఇలా ఎంతో అతిరథ మహారథుల మధ్య ఓపెనింగ్ జరిగింది. ఫస్ట్ షాట్ నాకు, రజినీ కాంత్ కు మధ్య. నేను రజినీ మెడలో పూల మాల వేయాలి. ఫ్లాష్ బ్యాక్ సీన్ లో. నేను అలా పూల మాల వేసిన వెంటనే రజినీ నా మెడలో పూల మాల వేసి.. కాళ్లకు దండం పెట్టుకున్నాడు. ఏంట్రా అంటే లేదురా నీ మంచి మనసుకు దండం పెట్టారా..ఈ సినిమా ఘన విజయం సాధిస్తుంది అని చెప్పాడు. అలా మొదలైన ఆ సినిమా పూర్తయి.. రిలీజ్ అయి ఎన్నో రికార్డులు.. ఎన్నో కొల్లెక్షన్స్ సాధించింది అని చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 14 =