1984 సంవత్సరం “జననీ జన్మభూమి “మూవీ తో గీత రచయితగా టాలీవుడ్ కు పరిచయం అయిన చెంబోలు సీతారామశాస్త్రి “సిరివెన్నెల “మూవీ కి గీత రచయిత గా పని చేసి ఆ మూవీ లోని అన్ని సాంగ్స్ ను రచించారు. ఆ మూవీ లోని “విధాత తలపున ” సాంగ్ కు బెస్ట్ లిరిసిస్ట్ గా నంది అవార్డ్ అందుకున్నారు. ఆ మూవీ పేరే ఆయనకు ఇంటి పేరుగా మారింది. పలు మూవీస్ కు సూపర్ హిట్ సాంగ్స్ అందించిన సిరివెన్నెల బెస్ట్ లిరిసిస్ట్ గా 11 నంది , 4 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
— Sirivennela Official (@sirivennela1955) June 4, 2020
లెజెండరీ రైటర్ సిరివెన్నెల సీతారామశాస్త్రి ని భారత ప్రభుత్వం “పద్మశ్రీ “పురస్కారంతో సత్కరించింది. సిరివెన్నెల ఈ రోజు సోషల్ మీడియా లో ఎంటర్ అయ్యారు. ట్విట్టర్ ఖాతా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. తన ఫీలింగ్స్ ను అభిమానులు , ప్రేక్షకులతో పంచుకోవాలనే ట్విట్టర్ ఖాతా ప్రారంభించినట్టు తెలిపారు. సిరివెన్నెల ప్రస్తుతం కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న “రంగ మార్తాండ ” మూవీ తో పాటు పలు చిత్రాలకు గీత రచయిత గా పనిచేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: