మొత్తానికి టాలీవుడ్ లో ఒకరి తర్వాత ఒకరు పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. ఇటీవలే హీరో నిఖిల్, కమెడియన్ మహేష్ వరుసగా ఒక్కొక్కరు పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసిందే. కరోనా ఉన్నా కూడా నిబంధలను పాటిస్తూ సింపుల్ గా పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇక రానా కూడా తన ప్రేమను అందరికీ పరిచయం చేయడం… వెంటనే నిశితార్థం. త్వరలోనే పెళ్లి కూడా జరగనుంది. ఆగష్ట్ 8వ తేదీన రానా పెళ్లి జరగనుంది. ఇంకా నితిన్ పెళ్లి ఒక్కటి మిగిలింది. మరి నితిన్ కూడా కొద్దిరోజులు ఆగుతాడో.. నిబంధలను పాటిస్తూ చిన్నగా కానిస్తాడో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ జాబితాలో సాహో డైరెక్టర్ సుజిత్ కూడా చేరిపోయినట్టు తెలుస్తుంది. త్వరలోనే సుజీత్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు తెలుస్తుంది. ప్రవల్లిక అనే డెంటిస్ట్‌తో సుజీత్ గత కొద్దికాలంగా ప్రేమలో ఉన్నాడట. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించడంతో.. త్వరలోనే పెళ్లి జరగనున్నట్టు తెలుస్తుంది. జూన్ 10న హైదరాబాద్‌లో సుజీత్-ప్రవళికల నిశ్చితార్థం ఉండనున్నట్లు కూడా సమాచారం. లాక్‌డౌన్ కారణంగా ఎంగేజ్‌మెంట్ చాలా సింపుల్‌గా జరగనుందని, ఈ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవుతారట.




రన్ రాజా రన్ తో దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమైన సుజీత్ తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో భారీ బడ్జెట్ సినిమా ‘సాహో’ తీసి ఈ సినిమాతో ఏకంగా నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ నమ్మకంతోనే మెగాస్టార్ తన లూసిఫర్ భాద్యతలు సుజీత్ కు అప్పంగించారు. ప్రస్తుతం సుజీత్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: