13 సంవత్సరాలుగా పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి తెలుగు , తమిళ ప్రేక్షకులను తన అందం , అభినయం తో ఆకట్టుకుంటున్న కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియా లో ఫోటోలు , వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. కొత్త కోర్సులు నేర్చుకొంటూ, బుక్స్ చదువుతూ, వంట చేస్తూ కాజల్ లాక్ డౌన్ సమయాన్ని స్పెండ్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి “ఆచార్య “, హాలీవుడ్ క్రాస్ ఓవర్ “మోసగాళ్ళు “, తమిళ భాషలో “ఇండియన్ 2 “,హిందీ లో “ముంబై సాగ ” మూవీస్ లో నటిస్తున్నారు. షూటింగ్స్ ప్రారంభం అయితే కాజల్ బిజీగా మారనున్నారు. అప్పుడు సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండి కాజల్ రోజూ షేర్ చేసే ఫొటోస్ , వీడియోస్ అభిమానులు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. కొన్ని రోజుల క్రితం మేకప్ లేకుండా సహజ సౌందర్యం తో మచ్చలేని చందమామ లా ఉన్న తన అందమైన ఫోటో ను కాజల్ సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఆఫొటో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: