తెలుగునాట అగ్ర కథానాయకుడు ‘విక్టరీ’ వెంకటేష్, అగ్ర కథానాయిక సౌందర్య కాంబినేషన్‌కి ప్రత్యేక స్థానముంది. వీరిద్దరి కలయికలో ఏడు చిత్రాలు తెరకెక్కగా వాటిలో ఐదు సినిమాలు ఘనవిజయం సాధించడం విశేషం. వాటిలో ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ ఒకటి. అగ్రశ్రేణి దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో.. వినీత మరో కథానాయికగా నటించగా కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, మల్లికార్జునరావు, బాబుమోహన్, ఏవీయస్, మాస్టర్ నాగ్ అన్వేష్ ముఖ్య భూమికలు పోషించారు. తమిళ చిత్రం ‘తాయ్‌కులమే.. తాయ్‌కులమే..’ ఆధారంగా ఈ సినిమా రూపొందింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాకి కోటి అలరించే బాణీలు అందించగా సామవేదం షణ్ముఖ శర్మ సాహిత్యం సమకూర్చారు. “బోల్ బోల్ బోల్”, “ప్రియురాలే ప్రేమగా”, “అమ్మనే అయ్యానురా”, “పాపరో పాప్”, “చిలకతో మజా”, “ఓలమ్మి తిమ్మిరి ఎక్కిందే ఎక్కడో”.. ఇలా ఇందులోని పాటలన్నీ అప్పట్లో ప్రేక్షకులను అలరించాయి. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.యల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. 1996 మే 22న విడుదలైన ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు”.. నేటితో 24 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: