‘బుజ్జిగాడు’గా ప్ర‌భాస్‌కి 12 ఏళ్ళు

Young Rebel Star Prabhas and Trisha Hat trick Movie Bujjigadu Completes 12 Years.

యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్‌కి అచ్చొచ్చిన కథానాయికల్లో త్రిష ఒకరు. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన తొలి చిత్రం ‘వర్షం’ ఘ‌న‌విజ‌యం సాధించ‌గా.. రెండో సినిమా ‘పౌర్ణమి’ మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. అలాంటి స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన థ‌ర్డ్ ఫిల్మ్ ‘బుజ్జిగాడు’. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.యస్.రామారావు ఈ చిత్రాన్ని నిర్మించగా ‘ఇస్మార్ట్’ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించాడు. ఇందులో డా.మోహన్ బాబు కీలక పాత్రలో దర్శనమివ్వగా.. సంజన, కోట శ్రీనివాసరావు, సునీల్, యం.యస్.నారాయణ, అలీ, హేమ, అజయ్, సుబ్బరాజు, సుప్రీత్, ‘ఆహుతి’ ప్రసాద్, సుధ, బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను ముఖ్య పాత్రలు పోషించారు. ముమైత్ ఖాన్ ప్రత్యేక గీతంలో నర్తించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భాస్కరభట్ల, కందికొండ గీతరచనకు సందీప్ చౌతా బాణీలు సమకూర్చాడు. “సూడు సూడే”, “చిట్టి ఆయిరే”, “గుచ్చి గుచ్చి”, “ధడక్ ధడక్”, “తలైవా”, “లవ్ మీ”.. ఇలా ఇందులోని ప్రతీ పాట ప్రేక్షకులను అలరించింది. 2008 మే 22న విడుదలైన ‘బుజ్జిగాడు’.. నేటితో 12 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =