భీష్మ సూపర్ హిట్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు నితిన్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తోంది.వెంకీ తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రాన్ని రొమేంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా చైతన్య కృష్ణ దర్శకత్వంలో ‘పవర్ పేట’ సినిమా కూడా లైన్ లో వుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇందులో మరో యంగ్ హీరోకి కూడా చోటు దక్కినట్టు తెలుస్తుంది. ఈ యంగ్ హీరో ఎవరో కాదు సత్యదేవ్. ఈ చిత్రంలో సత్య దేవ్ కు ఓ కీలకమైన పాత్రలో నటించే అవకాశం దక్కిందట. సత్యదేవ్ పాత్ర నితిన్‌తో పాటు సమానంగా ఉంటుందని, ఈ కథని మలుపు తిప్పడంలో కీలకం అవుతుందని తెలుస్తోంది. ఇక రావు రమేష్ కూడా ఈ సినిమాలో ఓ కీలమైన పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా కీర్తి సురేష్ నే తీసుకుందామని అనుకుంటున్నారట. ఇప్పటికే నితిన్ తో కలిసి కీర్తి సురేష్ రంగ్ దే సినిమాలో చేస్తుంది.
ఇక వీటితో పాటు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ లో సస్పెన్స్ థ్రిల్లర్ ‘అంధాదున్’ సినిమా రీమేక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలను సైతం పూర్తిచేసుకోగా… షూటింగ్ మొదలు పెడదాం అనుకునేలోపు కరోనా వల్ల బ్రేక్ పడింది. ఈ రెండు సినిమాలు కాకుండా టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: