తెలుగునాట పలు తమిళ ప్రేమకథా చిత్రాలు అనువాద రూపంలో అలరించాయి. మ్యూజికల్‌గానూ మెప్పించాయి. అలాంటి వాటిలో ‘ప్రియురాలు పిలిచింది’(తమిళ్ వెర్షన్ టైటిల్ ‘కండుకొండేన్ కండుకొండేన్’) ఒకటి. స్వరమాంత్రికుడు ఏ.ఆర్.రెహమాన్ సంగీతమందించిన ఈ కవితాత్మక ప్రేమకథా చిత్రంలో మమ్ముట్టి, అజిత్, అబ్బాస్, ఐశ్వర్యారాయ్, టబు, పూజాబాత్రా, శ్రీవిద్య, రఘువరన్, బేబి షామిలి.. ఇలా భారీ తారాగణమే ఉంది. జేన్ ఆస్టెన్ రచించిన బ్రిటిష్ నవల ‘సెన్స్ అండ్ సెన్సిబిలిటీ’ ఆధారంగా ఈ సినిమాని ఆద్యంతం ఆహ్లాదభరితంగా తెరకెక్కించాడు టాలెంటెడ్ డైరెక్టర్ రాజీవ్ మీనన్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎ.ఎమ్.రత్నం, శివగణేష్ సాహిత్యం సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలు అప్పట్లో ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేశాయి. “పలికే గోరింకా”, “గంధపు గాలిని”, “ఏమాయే నా కవిత”, “దోబూచులాటేలరా”, “తొంగి చూసే”, “స్మాయి ఆయి ఆయి”.. ఇలా ఇందులోని అన్ని పాటలు విశేషాదరణ పొందాయి. ఎ.ఎమ్.రత్నం సమర్పణలో శ్రీ సూర్యా మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. 2000 మే 5న విడుదలై మ్యూజికల్ హిట్‌గా నిలిచిన ‘ప్రియురాలు పిలిచింది’.. నేటితో 20 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: