100 మిలియన్ క్లబ్‌లో ‘హీ ఈజ్ సో క్యూట్’

He Is So Cute Lyrical Song from Mahesh Babu Latest Blockbuster Sarileru Neekevvaru Joins 100 Million Club On Youtube

సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’.. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించిన సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన బాణీలు ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. మరీ ముఖ్యంగా “హీ ఈజ్ సో క్యూట్” ఇన్‌స్టెంట్ హిట్ నంబర్‌గా నిలిచింది. కాగా, రీసెంట్‌గా ఈ పాటకి సంబంధించిన లిరికల్ వీడియో 100 మిలియన్ వ్యూస్‌ క్లబ్‌లో చేరింది. మహేష్ బాబు, రష్మికా మంద‌న్నపై చిత్రీకరించిన ఈ టీజింగ్ సాంగ్‌కి శ్రీమణి సాహిత్యం స‌మ‌కూర్చ‌గా మధుప్రియ గానం చేశారు. మరి మున్ముందు ఈ పాట‌ ఖాతాలో ఇంకెన్ని వ్యూస్ చేరతాయో చూడాలి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘సరిలేరు నీకెవ్వరు’కి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. అనిల్ సుంకర, ‘దిల్’ రాజు, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాతోనే లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి సుదీర్ఘ విరామం అనంత‌రం రీ-ఎంట్రీ ఇచ్చారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + four =