‘మెంటల్ మదిలో’(2017) చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కథానాయిక నివేత పెతురాజ్. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు పొందిన నివేత.. ఆ తరువాత ‘చిత్రలహరి’, ‘బ్రోచేవారెవరురా’ చిత్రాలతోనూ ఆకట్టుకుంది. అలాగే, ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫిల్మ్ ‘అల వైకుంఠపురములో’లో నటించే అవకాశాన్ని దక్కించుకోవడమే కాకుండా.. భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుందీ టాలెంటెడ్ బ్యూటీ. ప్రస్తుతం విడుదలకు సిధ్ధంగా ఉన్న రామ్, కిషోర్ తిరుమల కాంబో మూవీ ‘రెడ్’లోనూ నటించింది నివేత. ఇదిలా ఉంటే.. మరోసారి అల్లు అర్జున్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశాన్నినివేత దక్కించుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే.. బన్నీ, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో ‘పుష్ప’ పేరుతో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఇందులో రష్మికా మందన్న కథానాయికగా నటిస్తోంది. కాగా, ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం..నివేత పెతురాజ్ ను సెలెక్ట్ చేసినట్టు సమాచారం. త్వరలోనే నివేత ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
కాగా.. పాన్ – ఇండియా ఫిల్మ్‌గా రూపొందుతున్న ‘పుష్ప’ని 2021 వేసవికి రిలీజ్ చేయబోతున్నారని ప్రచారం సాగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: