కథానాయకులను కొత్తగా ఆవిష్కరించడంలో ‘ఇస్మార్ట్’ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తీరే వేరు. ఆయన తెరకెక్కించిన ప్రతీ చిత్రంలోనూ ఇదే శైలిని కొనసాగించారు, కొనసాగిస్తున్నారు. అంతేకాదు.. తెలుగులో అన్ని వర్గాల కథానాయకులతోనూ సినిమాలు చేసిన వైనం పూరి సొంతం. అలాంటి పూరి దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘బద్రి’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో.. పవన్‌ను గత చిత్రాలకంటే డిఫరెంట్‌గా, పవర్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేశారు పూరి. “నువ్వు నందా అయితే ఏంటి? నేను బద్రి.. బద్రీనాథ్” అని పవన్ చేత చెప్పించిన డైలాగ్ ఇప్పటికీ సంచలనమే. అలా ఫస్ట్ మూవీతోనే తను ఒక డిఫరెంట్ డైరెక్టర్ అని నిరూపించుకున్నారాయన. దర్శకుడిగా మాత్రమే కాకుండా.. కథ, కథనం, మాటలను కూడా తనే సమకూర్చి ఈ చిత్రాన్ని రూపొందించిన తీరు అందరినీ కట్టిపడేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘బద్రి’లో పవన్ కళ్యాణ్ సరసన రేణూ దేశాయ్, అమీషా పటేల్ నాయికలుగా నటించగా.. ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, సంగీత, రమాప్రభ, బ్రహ్మానందం, అలీ, మల్లికార్జునరావు, ఎం.ఎస్.నారాయణ ముఖ్య భూమికలు పోషించారు.
వేటూరి సుందరరామమూర్తి, చంద్రబోస్, జలీస్ షేర్వాణి సాహిత్యానికి.. రమణ గోగుల అలరించే బాణీలు సమకూర్చారు. “బంగాళాఖాతంలో”, “హే చికితా”, “వేవేల మైనాల”, “చలిపిడుగుల్లో”, “ఐ యామ్ ఏన్ ఇండియన్” పాటలు యూత్‌ను అలరించాయి. విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత టి.త్రివిక్రమరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. 2000 ఏప్రిల్ 20న విడుదలై ఘన విజయం సాధించిన ‘బద్రి’.. నేటితో 20 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
‘బద్రి’ – కొన్ని విశేషాలు:
* ‘గోకులంలో సీత’, ‘సుస్వాగతం’, ‘తొలిప్రేమ’, ‘తమ్ముడు’.. ఇలా నాలుగు వరుస విజయాల అనంతరం పవన్ నటించిన మరో బ్లాక్ బస్టర్ మూవీ ‘బద్రి’.
* పవన్ సరసన రేణూ దేశాయ్, అమీషా పటేల్ నాయికలుగా తెరకెక్కిన తొలి చిత్రమిది.
* ‘తమ్ముడు’ వంటి మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో రమణ గోగుల అందించిన మరో మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ మూవీ ఇది.
* యు.ఎస్.లో విడుదలైన తొలి తెలుగు చిత్రంగా చరిత్ర సృష్టించింది ‘బద్రి’.
* ఈ చిత్రాన్ని హిందీలో ‘షర్త్: ది ఛాలెంజ్’(2004) పేరుతో పూరీనే తెరకెక్కించారు. అంతేకాదు.. బాలీవుడ్‌లో పూరికి ఇదే ఫస్ట్ ఫిల్మ్ కావడం విశేషం. దీని తరువాత బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో ‘బుడ్డా.. హోగా తేరా బాప్’(2011)ను రూపొందించారు పూరి.
* మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో ‘గూఢచారి నెం.1’, ‘దొంగ’, ‘కొండవీటి దొంగ’ వంటి చిత్రాలను నిర్మించిన టి.త్రివిక్రమరావు.. చిరు తమ్ముడు పవన్ నటించిన ‘బద్రి’ని కూడా నిర్మించడం విశేషం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: