మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ రమేష్ వర్మ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నాడు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో రవితేజ రెండు విభిన్నమైన పాత్రల్లో దర్శనమివ్వనున్నాడని సమాచారం. కాగా, ఇందులో ఇద్దరు కథానాయికలకు స్థానముండగా.. ఇప్పటికే ఓ హీరోయిన్గా నిధి అగర్వాల్‌ని ఎంపిక చేసింది చిత్ర బృందం. తాజాగా మరో హీరోయిన్ రోల్ కోసం నభా నటేష్‌ని సెలెక్ట్ చేశారట. త్వరలోనే నభా ఎంట్రీపై క్లారిటీ రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. గత ఏడాది సంచలన విజయం సాధించిన ‘ఇస్మార్ట్ శంకర్’లో నిధి, నభా నాయికలుగా నటించారు. కట్ చేస్తే.. మళ్ళీ రవితేజ సినిమా కోసం వాళ్ళిద్దరూ మరోసారి జట్టుకట్టనుండడం వార్తల్లో నిలుస్తోంది. నభా ఇప్పటికే ‘డిస్కోరాజా’లో రవితేజతో ఆడిపాడగా.. నిధికి మాత్రం ఇదే తొలి చిత్రం. మరి.. రవితేజకి ఈ ‘ఇస్మార్ట్’ హీరోయిన్స్ కాంబినేషన్ ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























