సక్సెస్ ఫుల్ “ఎవడే సుబ్రమణ్యం ? ” మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన నాగ్ అశ్విన్, ఆ మూవీ కి బెస్ట్ డైరెక్టర్ గా నంది అవార్డ్ అందుకున్నారు. లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ మూవీ బ్లాక్ బస్టర్ “మహానటి” మూవీ తో నాగ్ అశ్విన్ క్రిటిక్స్, ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. “#Prabhas 21” మూవీ కి దర్శకత్వం వహించనున్నారు. కరోనా కారణంగా “#Prabhas 20” మూవీ డిలే కావడంతో “#Prabhas 21” మూవీ కూడా డిలే కానుంది, అందువల్ల నాగ్ అశ్విన్ ఒక వెబ్ సిరీస్ కు ప్లాన్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందే వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ ద్వారా ప్రసారం కానుంది. ఈ వెబ్ సిరీస్ ను రానా దగ్గుబాటి తన హోమ్ బ్యానర్ ద్వారా నిర్మించనున్నారని సమాచారం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పారంభించిన నాగ్ అశ్విన్ నటీనటుల ఎంపిక లో బిజీగా ఉన్నారు. ప్రముఖ దర్శకులు, నటీ నటులు వెబ్ సిరీస్ లపై ఆసక్తి చూపుతున్నారు . పలు మూవీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న రానా దగ్గుబాటి నిర్మాణ రంగంలో కూడా ప్రవేశించిన విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: