శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో ‘లవ్ స్టోరీ’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉండగా.. కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తూ చిన్నగా ప్రమోషన్ మొదలుపెట్టేసింది ఫిలిం యూనిట్. రిలీజ్ చేసిన పోస్టర్స్, నాగచైతన్య ఫస్ట్ గ్లింప్స్, ‘ఏ పిల్లా సాంగ్’ పాట ఇలా అన్నీ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ ఎఫెక్ట్ సినిమాపై బాగానే పడింది. అందుకే ఈ సినిమా శాటిలైట్ హక్కులు .. ఓవర్సీస్ హక్కులు భారీ రేటు పలుకుతున్నాయట. శేఖర్ కమ్ముల ఇంతకుముందు చేసిన ‘ఫిదా’ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో దానికి తోడు ఆ సినిమాకి ఓవర్సీస్ లో విశేషమైన ఆదరణ లభించడంతో ‘లవ్ స్టోరీ’కి మంచి డిమాండ్ వచ్చిందని చెబుతున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి డిమాండ్ వున్నట్టు చెబుతున్నారు. మరి ఆ వివరాలు తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
కాగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకా రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పవన్ సంగీతం అందిస్తున్నాడు. మరి బ్లాక్ బస్టర్ “ఫిదా” మూవీ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. అంతేకాదు ఫిదాలో సాయి పల్లవితో మ్యాజిక్ క్రియేట్ చేసాడు శేఖర్ కమ్ముల. ఇప్పుడు మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేసేందుకు వచ్చేస్తున్నాడు. చూద్దాం మరి నాగ చైతన్య-సాయి పల్లవిల ‘ లవ్ స్టోరీ’ ఎలా ఉంటుందో…
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: