లాక్ డౌన్ సమయంలో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇంట్లో ఉండే కొత్త సినిమా కథను రాసే పనిలో ఉన్నాడని ఇప్పటికే వార్తలు జోరుగా ప్రచారం అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. అదేంటంటే… ఓ అగ్ర హీరో కోసం పూరీ కథను సిద్ధం చేసే పనిలో పడ్డాడట. ఆ అగ్ర హీరో ఎవరో కాదు.. మెగా స్టార్ చిరంజీవి. నిజానికి 150వ సినిమాను పూరీనే తెరకెక్కించాల్సి ఉంది. దీనికి ఆటోజానీ అనే టైటిల్ కూడా కన్ఫర్మ్ చేసాడు పూరీ. అయితే స్టోరీ అంత నచ్చకపోవడంతో చిరు వెనక్కి తగ్గాడు. ఇప్పుడు మరోసారి.. చిరు కోసం పూరీ స్క్రిప్ట్ ను రాసే పనిలో వున్నాడట. అంతేకాదు తాజాగా అభిమానులతో మాట్లాడుతూ స్టార్ హీరో కోసం కథ సిద్ధం చేస్తున్నట్లు చెప్పాడు. ఇక ఆ స్టార్ చిరంజీవినే అని తెలుస్తుంది. ఈసారి మాత్రం పక్కాగా చిరుకు నచ్చే కథ సిద్ధం చేస్తున్నాడట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ‘ఫైటర్’ అనే పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా చిత్రీకరణ వాయిదా వేశారు. ఫైటర్ సినిమా హిట్టయితే కచ్చితంగా చిరు, పూరీ సినిమా పట్టాలెక్కే అవకాశం కనిపిస్తుంది. మరి చూడాలిక చిరంజీవి ఈ సారైనా పూరీ కి ఛాన్స్ ఇస్తాడో లేదో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: