యువ కథానాయకుడు నిఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘18 పేజెస్’. ‘కుమారి21 ఎఫ్’ ఫేమ్ సూర్య ప్రతాప్ పల్నాటి డైరెక్ట్ చేయనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం పూర్వ నిర్మాణ దశలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… తొలుత ఈ సినిమాలో నిఖిల్‌కు జోడీగా `ఉప్పెన` ఫేమ్ కృతి శెట్టిని నాయికగా ఎంపిక చేసినట్టు వార్తలు వినిపించాయి. అయితే, ఇప్పుడా అవకాశం అను ఇమ్మాన్యుయేల్‌ను వరించినట్లు సమాచారం. అంతేకాదు… కథానాయిక పాత్రకి అను అయితేనే బావుంటుందని దర్శకుడు భావిస్తున్నాడట. ఈ మేరకు అనుతో కథా చర్చలు కూడా జరుపుతున్నట్టు టాక్. త్వరలోనే అను ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
ప్రస్తుతం అను ఇమ్మాన్యుయేల్… బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ‘అల్లుడు అదుర్స్’లో సెకండ్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరి, రాబోయే చిత్రాలతోనైనా ఈ టాలెంటెడ్ బ్యూటీ… మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తుందేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: