మాస్ మహరాజా రవితేజకు కలిసొచ్చిన దర్శకుల్లో శ్రీను వైట్ల ఒకరు. వీరిద్దరి కాంబినేషన్‌లో నాలుగు చిత్రాలు తెరకెక్కగా… వాటిలో మూడు సినిమాలు విజయం సాధించాయి. అందులో ‘వెంకీ’ ఒకటి. రవితేజ టైటిల్ రోల్ లో నటించిన ఈ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో స్నేహ కథానాయికగా నటించింది. అశుతోష్ రాణా, శ్రీనివాస్ రెడ్డి, ‘చిత్రం’ శ్రీను, బ్రహ్మానందం, ఏవీయస్, వేణుమాధవ్, మల్లికార్జునరావు, తనికెళ్ళ భరణి, ‘ఆహుతి’ ప్రసాద్, కృష్ణ భగవాన్, ఢిల్లీ రాజేశ్వరి, మాస్టర్ భరత్ తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషించారు. రాశి ప్రత్యేక గీతంలో నర్తించగా… సుమన్ అతిథి పాత్రలో దర్శనమిచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సాహితీ గీత రచన చేయగా… టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందించారు. “గోంగూర తోట కాడ”, “అందాల చుక్కల లేడి”, “అనగనగా కథలా”, “సిలకేమో సికాకుళం”, “మార్ మార్”, “ఓ మనసా” వంటి పాటలు ప్రేక్షకులను అలరించాయి. లక్ష్మీ ప్రొడక్షన్స్ పతాకంపై అట్లూరి పూర్ణచంద్రరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. 2004 మార్చి 26న విడుదలైన ‘వెంకీ’… నేటితో 16 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: