కోలీవుడ్ స్టార్ విజయ్‌కి అచ్చొచ్చిన కథానాయికల్లో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఒకరు. వీరిద్దరి కలయికలో వచ్చిన `తుపాకి`, `మెర్సల్` (తెలుగులో `అదిరింది`) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. కట్ చేస్తే… స్వల్ప విరామం అనంతరం ఈ జోడీ ముచ్చటగా మూడోసారి జట్టుకట్టనుందట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




ఆ వివరాల్లోకి వెళితే… `తుపాకి` , `కత్తి` , ‘సర్కార్’ వంటి విజయవంతమైన చిత్రాల తరువాత విజయ్, దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. `తుపాకి`కి సీక్వెల్ గా రూపొందనున్న ఈ చిత్రంలో విజయ్ కి జోడీగా కాజల్ సందడి చేయనుందట. త్వరలోనే కాజల్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. మరి.. `తుపాకి`తో అలరించిన విజయ్ – కాజల్ – మురుగదాస్ త్రయం… సీక్వెల్ తోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: