సింగీతం శ్రీనివాసరావు అంటే మనకి వెంటనే గుర్తొచ్చే సినిమా పేరు పుష్ఫకవిమానం. ఆయన సినీ కెరీర్ లో పుష్ఫకవిమానం, ఆదిత్య 369, విచిత్ర సోదరులు లాంటి ఎన్నో గొప్ప సినిమాలను అందించారు. ఆయన చివరిగా వెల్ కమ్ ఒబామా అనే సినిమా తీసారు. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్లకు డైరెక్షన్ చేయడానికి ముందుకొస్తున్నారు. కొత్త కొత్త కథలతో.. కొత్త కొత్త దర్శకులు.. ఎంతో మంది సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో.. ఇప్పుడు ఈ వయసులో.. ఇన్నేళ్ల తర్వాత మరోసారి దర్శకత్వం చేయడానికి రెడీ అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎప్పుడు విభిన్నమైన కథలను తెరకెక్కించే సింగీతం శ్రీనివాసరావు ఈసారి ఓ బయోపిక్ ను తీయాలని నిర్ణయించుకున్నారట. ప్రముఖ గాయని ఎం.ఎస్.సుబ్బలక్ష్మి జీవిత కథని బయోపిక్‌గా తీయబోతున్నారని తెలుస్తుంది.శాస్త్రీయ సంగీత ప్రపంచంలో ఎంతో ఉన్నత స్థానంకి ఎదిగిన ఆమె నేటి తరం గాయకులకి స్ఫూర్తి. అలాంటి ఆమె జీవితం, గాయనిగా ఆమె ప్రయాణం చూపించే విధంగా కథని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయట. పీపుల్స్ మీడియా సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నదని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: