తండ్రి కథతో నరేష్ సినిమా..!

Allari Naresh Comes Up With A New Movie Based On EVV Satyanarayana Script,,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Allari Naresh,Allari Naresh Latest News,Allari Naresh New Movie News,Allari Naresh Next Project News,Allari Naresh Latest Movie Details

ఈవీవీ కథను అల్లరి నరేష్ చేయడం ఏంటబ్బా అని అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే.. ఈవీవీ ఉన్న టైంలో అల్లరి నరేష్ తో సినిమా చేయనుకున్నాడట. అందుకుగానూ ఒక స్క్రిప్ట్ ను కూడా రెడీ చేశారట. ఆ తర్వాత ఈవీవీ కలగమనం చెందటం.. అల్లరి నరేష్ కూడా వేరే సినిమాలతో బిజీ అవ్వడంతో ఈ స్క్రిప్ట్ పక్కన పడిపోయింది. ఇప్పుడు అదే కథను సినిమాగా తీయ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. డైరెక్టర్ ఎన్నో గొప్ప గొప్ప సినిమాలను తీసిన ఈవీవీ సినిమా ప‌తాకంపైనే ఈ సినిమాను నరేష్ తెరకెక్కించనున్నాడట. న‌రేష్‌కీ అత్యంత స‌న్నిహితంగా ఉన్న ఓ ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తాడ‌ని స‌మాచారం. అంతేకాదు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. ఇది ఈవీవీ గ‌త హిట్ చిత్రాల‌కు సీక్వెల్ అని స‌మాచారం. మ‌రి.. ఆ క‌థేమిటో, సినిమా ఎప్పుడో.. నరేష్ చెప్పేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తన కెరీర్ ప్రారంభంలో వరుస హిట్లతో దూసుకుపోయిన అల్లరి నరేష్ కు గత కొంతకాలంగా సరైన హిట్ పడలేదు. దానితో కాస్త వెనుకపడ్డాడు. ఇక ఇటీవల మహర్షి సినిమాలో మహేష్ బాబు కు ఫ్రెండ్ గా చేయగా ఆ పాత్రకు మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం నాంది అనే మరో డిఫరెంట్ సినిమాతో వస్తున్నాడు. ఇక ఈ సినిమా తొలి షెడ్యూల్ ఇటీవలే ముగియగా… రెండవ షెడ్యూల్ షూటింగును కూడా మొదలుపెట్టారు. ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ లో సతీష్ వేగేశ్న నిర్మిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌, హరీష్‌ ఉత్తమన్‌, ప్రవీణ్‌, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీచరణ్‌ పాకాల అందిస్తున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి సమ్మర్లో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − one =